గో బ్యాక్ సీఎం సర్: ముందు అమరావతి సంగతి చూడండి- విశాఖలో పోస్టర్లు
ఉత్తరాంధ్ర పట్టభధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వెనుకంజలో ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో గో బ్యాక్ సీఎం సర్ బ్యానర్లు విస్తృతంగా వెలిశాయి. వాటిని వైసీపీ నాయకులు తొలగించారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల (MLC elections) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. స్థానిక సంస్థలు (Graduate constituencies), ఉపాధ్యాయ (Teachers constituencies) నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండింట్లో ఉన్న మొత్తం స్థానాలన్నింటినీ వైఎస్ఆర్సీపీ (YSRCP) అభ్యర్థులు గెలుచుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి తారుమారయింది. పట్టభద్రుల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత నెలకొందనేది స్పష్టమైనట్టే.
ఉత్తరాంధ్ర (North Andhra), తూర్పు రాయలసీమ (East Rayalaseema) స్థానాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP) హవా కొనసాగుతోంది. పశ్చిమ రాయలసీమ (West Rayalaseema) పట్టభధ్ర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ప్రత్యేకించి- విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ప్రకటన చేసిన తరువాత కూడా ఉత్తరాంధ్రలో అధికార పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ (Seethamraju Sudhakar) వెనుకంజలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

విశాఖపట్నాన్ని (Visakhapatnam) పరిపాలన రాజధానిగా మార్చడానికి ఉత్తరాంధ్రవాసులు అంగీకరించట్లేదనే విషయం ఈ ఎన్నిక ఫలితాలతో స్పష్టమౌతోందనేే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా (Amaravati)ని మాత్రమే కొనసాగించాలనే తమ డిమాండ్ ను ఈ ప్రాంత పట్టభద్రులు తమ ఓటు హక్కు ద్వారా తెలియజేశారని చెబుతున్నారు. సాధారణంగా ఉత్తరాంధ్ర (North Andhra)లో తెలుగుదేశం (TDP) బలంగా ఉంటుందని, దీన్ని మరోసారి నిరూపించుకుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య- విశాఖపట్నం (Visakhapatnam)లో కొత్తగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. నల్ల రంగు పోస్టర్లపై వైఎస్ జగన్ (YS Jagan) ఫొటోను ముద్రించారు. గో బ్యాక్ సీఎం సర్ (Go back CM Sir) అనే అక్షరాలను వాటిపై ముద్రించారు. అమరావతి రాజధాని నిర్మించాలనే డిమాండ్ ను అందులో పొందుపరిచారు. జన జాగారణ సమితి పేరు మీద ఆయా పోస్టర్లన్నీ ఏర్పాటయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్, సిరిపురం, ఆంధ్రా యూనివర్శిటీ ప్రధాన గేటు, మద్దిలపాలెం, ఇసుకతోట, సీతమ్మ ధార, హెచ్ బీ కాలనీ, శాంతిపురం వంటి ప్రాంతాల్లో ఆయా పోస్టర్లు వెలిశాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ దృష్టికి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం నగర విభాగం నాయకులు, కార్యకర్తలు వాటిని తొలగించారు. జన జాగృతి సమితి ఎక్కడిదనే విషయంపై వారు ఆరా తీస్తోన్నారు.












Click it and Unblock the Notifications