వైజాగ్ స్టీల్ కోసం మలిదశ పోరు-రేపటి ఏపీ వ్యాప్త నిరసనలకు భారీ మద్దతు..!

ఏపీలో ప్రభుత్వ రంగ సంస్ధగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు మలిదశ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా రేపు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. వీటిలో పాల్గొనాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు పిలుపునిచ్చాయి. దీంతో ఇప్పటికే రాష్ట్ర లారీ యజమానుల సంఘంతో పాటు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రాస్తారోకోలకు సీపీఎం మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని పార్టీలు, సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై, మోడీపై ఉమ్మడి పోరు సాగించాలని పిలుపునిచ్చింది. బీజేపీ ప్రభుత్వ మెడలు వంచాలని సీపీఎం నేతలు సూచించారు. విశాఖ ఉక్కును రక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాలన్నారు. ఇవాళ విజయవాడ గవర్నర్ పేటలో సిపిఎం, సిఐటియు నేతలు విశాఖ ఉక్కు పరిరక్షణకై మూడో తేదీన జరిగే రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.

protest against vizag steel privatisation tomorrow in ap

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటవేదిక చైర్మన్ సీహెచ్.నర్సింగరావు రూపొందించిన పత్రాల్ని నేతలు విజయవాడలో పంపిణీ చేశారు. 32 మంది తెలుగు ప్రజల ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును దక్షిణ కొరియాకు చెందిన పోస్కో, ఆదాని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తెగనమ్మటానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మి మోడీ దేశద్రోహానికి పాల్పడుతున్నారన్నారు.

విశాఖ ఉక్కు పరిరక్షణకై రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల నుండి 11 గంటల మధ్య జరిగే రాస్తారోకోలు జయప్రదం చేయాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో 9.30 గంటలకు కృష్ణలంక రాణి గారి తోట వద్ద హైవేపై జరిగే రాస్తారోకోలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఇప్పటికే సీపీఎం, సీపీఐ సహా అన్ని కార్మిక, ప్రజా సంఘాలు భాగస్వాములవుతుండగా.. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని నేతలు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+