Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో నవరత్నాల హామీకి శ్రీకారం .. నేడు విజయనగరంలో జగనన్న వసతి దీవెన ప్రారంభం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నవరత్నాల హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'అమ్మ ఒడి' ద్వారా చదువుకోవటానికి ఆర్ధిక భరోసా ఇస్తున్న ఏపీ సర్కార్ వృత్తి విద్యా కోర్సులు చేసే వారి కోసం కూడా వారికి అండగా ఉండే పథకాన్ని అందించనుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సులు చదువుతున్నవారి కోసం 'జగనన్న వసతిదీవెన' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ నేడు విజయనగరం వేదికగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

 విజయనగరంలో నేడు జగనన్న వసతిదీవెన ప్రారంభం

విజయనగరంలో నేడు జగనన్న వసతిదీవెన ప్రారంభం


వృత్తి విద్యాకోర్సులు అభ్యసించే వారికి ఆర్ధిక భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ. 10 వేల నుండి రూ.20 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని సోమవారం విజయనగరంలో ప్రారంభిస్తున్నారు జగన్ . అయితే ఉన్నత విద్యాకోర్సుల వారే కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం వర్తింపజేస్తున్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి స్కీమ్ ..జగనన్న వసతి దీవెన కార్డుల అందజేత ..

రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి స్కీమ్ ..జగనన్న వసతి దీవెన కార్డుల అందజేత ..

ఇక బియ్యం కార్డు, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు జగనన్న విద్యాదీవెన కార్డు , జగనన్న వసతి దీవెన కార్డు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు జగనన్న వసతి దీవెన కార్డులను పంపించిన అధికార యంత్రాంగం నేడు సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించాక అధికారికంగా పంపిణీ చెయ్యనున్నారు . మంగళవారం నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్దిదారులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఈ కార్డును అందజేస్తారు. ఈ కార్డుతో పాటు ముఖ్యమంత్రి సందేశపత్రం కూడా అందిస్తారు.

సీఎం పర్యటన సదర్భంగా విజయనగరంలో భారీ ఏర్పాట్లు

సీఎం పర్యటన సదర్భంగా విజయనగరంలో భారీ ఏర్పాట్లు


నేడు జగనన్న వసతి దీవెన విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభం చెయ్యనున్న సందర్భంగా పోలీస్ బ్యారెక్స్ నుంచి అయోధ్య మైదానం వరకు నాలుగు కిలోమీటర్ల పొడువున సీఎంకు స్వాగతం పలికేందుకు తొమ్మిది నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు . ఉదయం 11:15 గంటలకు అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ‘జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+