విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టీల్ సిటీలో ఎంపీ వర్సెస్ ఎస్పీ.. ఆ భూమి కోసం ఫైట్, రంగంలోకి కలెక్టర్..

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ చేస్తామని జగన్ సర్కార్ పదే పదే చెబుతోంది. దీంతో అక్కడ భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. రేటు పెరగడమే కాదు.. కబ్జాలు కూడా జరుగుతున్నాయి. అయితే సామాన్యులు ఏం చేయలేరు. అధికారం ఉన్నొడిదే గెలుపు.. కానీ విశాఖలో ఎంపీ వర్సెస్ ఎస్పీ మధ్య వివాదం జరుగుతుంది. స్థలం విషయంలో ఇద్దరూ ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో కలెక్టర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. విచారణ జరపాలని స్థానిక తహశీల్దార్‌ను ఆదేశించారు. కానీ ఎంపీ, ఎస్పీ మధ్య డైలాగ్ వార్ మాత్రం జరుగుతోంది.

 రౌడీలు.. పోలీసులు

రౌడీలు.. పోలీసులు

అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. భూ కబ్జాల ఆరోపణలు ఆగడం లేదు. ఎకరాలకొద్దీ స్వాధీనం చేసుకుని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. కొందరైతే అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అడ్డొచ్చినవారి సంగతేంటో తేల్చేస్తున్నారు. రికార్డుల్లో లొసుగులు ఉన్నా ప్రైవేటు భూములను ఆక్రమించేస్తున్నారు. ఇచ్చింది తీసుకుని స్థలం ఖాళీ చేయాలంటూ హెచ్చరిస్తున్నారు. మాట వినకుంటే రౌడీమూకలు.. అప్పటికీ కుదరకపోతే పోలీసులను సైతం రంగంలోకి దింపి బెదిరింపులకు దిగుగుతున్నారు.

ఎంవీవీ కంపెనీపై ఆరోపణలు

ఎంవీవీ కంపెనీపై ఆరోపణలు


విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణకు చెందిన నిర్మాణ కంపెనీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎంపీ ఎంవీవీకి చెందిన కొత్త వెంచర్‌ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. దాని పక్కనే ఉన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ మధుకు చెందిన స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని.. తన వెంచర్‌కు రోడ్డు సౌకర్యం కోసం.. తాను రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న భూమిపై రోడ్డు వేస్తే ఎలా అని అన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటున్నారు.

ఎస్పీ మధు కాంపౌండ్ వాల్ నిర్మాణం

ఎస్పీ మధు కాంపౌండ్ వాల్ నిర్మాణం


విశాఖ బక్కన్నపాలెం సర్వే నంబర్‌ 90/1A లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ మధు కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తుండగా.. ఎంవీవీ అనుచరులు అడ్డుకున్నారు. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో మధు ఫిర్యాదు చేశారు. తన స్థలంలో ఎంవీవీ వెంచర్‌ కోసం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారని ఆరోపించారు. అది గమనించి తన స్థలంలో కాంపాండ్‌వాల్‌ నిర్మిస్తుండగా అడ్డుకున్నారని చెప్పారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఎస్పీ ప్రశ్నిస్తున్నారు.

గోడ నిర్మించడంతోనే..

గోడ నిర్మించడంతోనే..


ఎస్పీ మధు చేసిన ఆరోపణలను ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ ఖండించారు. మధు అర్థరాత్రి అక్కడ గోడ నిర్మిస్తుండటంతో స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. వారి ఫిర్యాదుతో అనుమానం వచ్చి పనులు ఆపి వేశామన్నారు. రికార్డ్స్‌లో అది లే అవుట్‌ రోడ్‌గా చూపిస్తోందన్నారు. ఆ భూమి నిజంగానే ఎస్పీ సొంతమైతే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జిల్లాలో తాను ఎలాంటి భూమిని కబ్జా చేయలేదని ఎంపీ అన్నారు. తమ స్థలంలో పబ్లిక్ రోడ్డు ఉందంటే రోడ్డు వేసి ఇచ్చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరం కోసం తమ స్థలం గుండానే రోడ్డు వేసి కల్వర్ట్ నిర్మించామన్నారు. ఎస్పీ స్థలం వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌ రోడ్డులో ఉందని తెలిపారు. రోడ్డుపై వాల్ కడుతున్నారని తనకు ఫోన్ వచ్చిందన్నారు. పీఎస్‌కు ఫోన్‌ చేసి దానిని తాత్కాలికంగా ఆపాలని చెప్పానన్నారు.

విచారణ.. అక్రమణ లేదు: తహశీల్దార్

విచారణ.. అక్రమణ లేదు: తహశీల్దార్


మధు ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశాల మేరకు విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ రామారావు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సిబ్బంది వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. అయితే సదరు ఎస్పీ మధు ఆరోపించినట్టుగా ఆయనకు చెందిన 168 గజాలను ఎవరూ ఆక్రమించలేదని తహసీల్దార్‌ పేర్కొన్నారు. దీంతో ఎంపీ చేసిన కామెంట్స్ నిజం అయ్యాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం ఎస్పీ తప్పని తేలింది. మరీ దీనిపై వారిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలీ మరీ.

English summary
mp mvv satyanarayana vs ib sp madhu land dispute. land grab at vizag. collector order to tahsildar for inquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X