డాక్టర్ సుధాకర్ మృతి.. గతేడాది ఏపీ సర్కార్‌పై పోరాటం, చంద్రబాబు దిగ్బ్రాంతి
గతేడాది కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీంతో అతనిని సస్పెండ్ కూడా చేశారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు లేవని నానా హంగామా చేశారు. కోర్టు, కేసుల వరకు ఇష్యూ నడిచింది. ఒకానొక సందర్భంలో గుండు కూడా తీసుకున్నాడు.

సుధాకర్ మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారని ఆరోపించారు. సుధాకర్ మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతేడాది కరోనా సమయంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సుధాకర్‌ను రాష్ట్ర సర్కార్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.
Recommended Video
దీనికి సంబంధించి హైకోర్టులో కేసు నడిచింది. కోర్టు కూడా సీబీఐతో విచారణ జరిపించి ఆయనకు సంబంధించిన ఫిర్యాదులపై నివేదిక సమీకరించింది. ఇంతలో ఆయన చనిపోవడం కలచివేసింది. కానీ చంద్రబాబు మాత్రం ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్నారు. సుధాకర్ కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.












Click it and Unblock the Notifications