భార్గవ్ రేప్ కేసుతో సంబంధం లేదు -ఏడాదిగా అతను కాంటాక్ట్‌లో లేడు: omg నిత్యశ్రీ కీలక సందేశం
ఫన్నీ వీడియోలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక అంతర్జాతీయంగానూ పాపులరైన టిక్ టాక్ స్టార్ చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ దారుణ నేరాలు వెలుగులోకి వచ్చాయి. టిక్ టాక్ లో పరిచయమైన ఓ 14 ఏళ్ల బాలికను, సోషల్ మీడియాలో స్టార్ చేస్తానని, కామెడీ షోల్లో అవకాశాలు కల్పిస్తానని లోబర్చుకున్న భార్గవ్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, గర్భవతిని చేశాడు. ఈ మేరకు నమోదైన కేసులో అతనిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే బాధితురాలు ఎవరేదానిపై..

బాధితురాలు ఆమేనంటూ..
టిక్ టాక్, ఫన్ బకెట్ వీడియోల్లో భార్గవ్ తో పాటు కనిపిస్తూ, 'ఓ మై గాడ్' బాలికగా పాపులరైంది నిత్య శ్రీ అలియాస్ omg నిత్య. మైనర్ బాలిక అత్యాచారం కేసులో భార్గవ్ అరెస్టు తర్వాత బాధితురాలు నిత్యనే అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నిత్య ఫోటోలు, వీడియోలను వాడుతూ ఆమెనే బాదితురాలంటూ పలు యూట్యబ్ చానెళ్లు రూపొందించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో నిత్యశ్రీ నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కీలక సందేశమిచ్చింది. భార్గవ్ కేసుతో సంబంధం లేదంటూ నిత్య ఓ వీడియోను పోస్ట్ చేసింది..

ఆ మ్యాటర్ నాకు తెలీదు..
''నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్ బకెట్ భార్గవ్.. మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూశాను. చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది?? అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను.

ఆ బాధితురాలు నేను కాదు..
భార్గవ్‌ని చివరిసారిగా కలిసి సంవత్సరం పైనే అయ్యింది. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్ వాళ్లు నా పేరు వాడుతున్నారు. నా ఫొటోలు వాడుతున్నారు. వీళ్లందరూ తెలియక చేస్తున్నారని తెలిసి.. క్లారిటీ ఇస్తున్నా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు ఏంటో తెలుస్తుంది'' అంటూ నిత్యశ్రీ తన తల్లితో కలిసి వీడియోను విడుదత చేసింది.












Click it and Unblock the Notifications