విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖకు పవన్ కళ్యాణ్ ... విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జనసేనాని సభ.. బీజేపీలో బిగ్ డిబేట్!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడు రోజుల పర్యటన చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న నిరసనల నేపధ్యంలో ఆందోళనకారుల శిబిరాన్ని సందర్శించి, స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపనున్నారు. విశాఖ ఉక్కు కోసం నిర్వహించే సభలో మాట్లాడనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ పర్యటన జోష్ తెచ్చింది.

విశాఖలో పవన్ కళ్యాణ్ సభ ..

విశాఖలో పవన్ కళ్యాణ్ సభ ..

స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ విధానాన్ని వెల్లడిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సభపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఒకపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో జనసేన పార్టీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు అన్నది రాజకీయవర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పవన్ కళ్యాణ్ విశాఖ సభపై బీజేపీ శ్రేణుల్లో చర్చ

పవన్ కళ్యాణ్ విశాఖ సభపై బీజేపీ శ్రేణుల్లో చర్చ

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులలో అంతర్గత చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఆంధ్ర రాజకీయాలలో బిజెపి జనసేన మిత్రపక్షంగా ఎన్నికలకు వెళుతున్న సమయంలో,తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా నినాదం బీజేపీ శ్రేణులకు తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే జనసేన పార్టీ తమ సంపూర్ణ మద్దతును విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ సభ వాడి వేడి చర్చకు కారణంగా మారింది. పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడే దానిపై భవిష్యత్ లో బీజేపీ, జనసేన మిత్ర బంధం ఎలా ఉంటుంది అన్నది స్పష్టం అవుతుంది.

జనసేన , బీజేపీ పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ

జనసేన , బీజేపీ పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ


ఇప్పటికే కేవలం ఎన్నికల పొత్తులే ఇరు పార్టీల మధ్య ఉన్నాయని జనసేన తేల్చి చెప్తుంది. ఇక పార్టీ విధానాలు, నిర్ణయాలు ఎవరివి వారివే అని చెప్తుంది. కానీ అలా ఉండటం సాధ్యమేనా అన్నది కూడా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని మార్చుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, కేంద్ర పెద్దలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు.

బిజెపికి దూరం జరగడం కోసమే పవన్ స్ట్రాటజీనా ?

బిజెపికి దూరం జరగడం కోసమే పవన్ స్ట్రాటజీనా ?


విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన రోజుల్లోనూ పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం మరోమారు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. బిజెపికి దూరం జరగడం కోసమే పవన్ ఈ స్ట్రాటజీని తీసుకున్నట్టు బిజెపి నాయకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై కేంద్రం ముందు ఏం డిమాండ్లు పెడతారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం పై అటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గాలలోనూ, ఉద్యోగులలోనూ ఆసక్తి నెలకొంది.

విశాఖ ఉక్కు ఉద్యమ ప్రభావం తగ్గుతున్న సమయంలో పవన్ ఎంట్రీ .. ఏం జరుగుతుందో ?

విశాఖ ఉక్కు ఉద్యమ ప్రభావం తగ్గుతున్న సమయంలో పవన్ ఎంట్రీ .. ఏం జరుగుతుందో ?

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వివిధ రాజకీయ పార్టీలు ఉద్యమించిన సమయంలో సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ , అన్ని రాజకీయ పార్టీలు సైలెంట్ అయిన తర్వాత, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని అందరూ లైట్ తీసుకున్న తర్వాత రంగంలోకి దిగాడు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మళ్ళీ కొత్త శక్తి వచ్చినట్లు అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మూడు రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జరిగే పోరాటంలో భాగస్వామ్యం తీసుకోవడమే కాకుండా, విశాఖ కేంద్రంగా పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారించనున్నట్టు సమాచారం.

English summary
Pawan Kalyan will address the gathering in solidarity with the steel plant workers and employees in the wake of the ongoing protests against the privatization of the Visakhapatnam steel plant. This will lead to an internal debate on the Pawan Sabha in the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X