విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్ళదు .. స్టీల్ ప్లాంట్ పై, జగన్ పాలనపై పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం ఇప్పటికే అనేక మార్లు పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ దాకా వెళ్ళిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేసినప్పటికీ కేంద్రం స్పందించిన దాఖలాలు లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవరూ ఆపలేరని కేంద్రం చేసిన వ్యాఖ్యలతో, లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలతో స్పష్టమైంది.
Rashmi gautham: మోడరన్ డ్రెస్ లోనే కాదు, చీరలో కూడా అందాలు ఆరబోస్తున్న జబర్దస్త్ బ్యూటీ (ఫొటోస్)

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తగ్గని కేంద్రం
ఇటీవల లోక్ సభలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఆర్పి సింగ్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ పెట్టుబడి ఉపసంహరించాలని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ భేటీలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నారని, ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగించడంతో నిర్వహణ, సాంకేతికత, సామర్థ్యం పెరుగుతాయని, అధిక ఉత్పత్తి తో పాటు, ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయి అని వెల్లడించారు. ఉద్యోగులు, సిబ్బంది, వాటాదారులను పరిగణనలోకి తీసుకొని అన్ని రకాల కసరత్తు పూర్తి చేసిన తర్వాత వాటాల కొనుగోలు ఒప్పందం జరుగుతుందని కేంద్రమంత్రి వెల్లడించిన విషయం తెలిసిందే.

స్టీల్ ప్లాంట్ కోసం కొనసాగుతున్న ఆందోళనలు
ఇక ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడానికి ఎంతవరకైనా పోరాటం సాగిస్తామని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు తేల్చి చెబుతున్నారు. ఇక అధికార వైసిపి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని పదే పదే చెబుతోంది. బిజెపి మినహా రాజకీయ పార్టీలన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అవసరమైతే ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్రం మెడలు వంచాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది.

స్టీల్ ప్లాంట్ పై పురంధరేశ్వరి చెప్పింది ఇదే
ఇదిలా
ఉంటే
విశాఖ
స్టీల్
ప్లాంట్
పై
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు
బిజెపి
జాతీయ
ప్రధాన
కార్యదర్శి
పురంధరేశ్వరి.
స్టీల్
ప్లాంట్
ఎక్కడికీ
పోదు..
పోస్కో
వచ్చింది
అన్నారని,
ఇక
ఇప్పుడు
టాటా
సంస్థ
కొనడానికి
సిద్ధంగా
ఉందని
అంటున్నారని
ఆమె
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు.
ఉద్యోగుల
ప్రయోజనాలకు
భంగం
వాటిల్లకుండా
చూస్తామని
వెల్లడించారు.
స్టీల్
ప్లాంట్
ఉద్యోగులకు
మెరుగైన
ప్యాకేజీ
దక్కేలా
చూస్తామని
పురంధరేశ్వరి
హామీ
ఇచ్చారు.
మౌలిక
సదుపాయాలను
మెరుగుపరచాలని
,
ఐదు
రంగాల్లో
నిరర్ధక
ఆస్తులు
వినియోగించుకోవాలని
అనుకుంటున్నామని
అందులో
భాగంగానే
ఈ
నిర్ణయం
తీసుకున్నట్లుగా
పురంధరేశ్వరి
పేర్కొన్నారు.

ఏపీ సర్కార్ పై సీరియస్ అయిన పురంధరేశ్వరి
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఆదుకునే అంశంపై ఆలోచిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని కూడా పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వంపై పురంధరేశ్వరి ఫైర్ అయ్యారు. ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీని గెలిపిస్తే రెండున్నరేళ్లలో ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదని పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. కక్షపూరితంగా విధ్వంసకర పాలన చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో మోసం, అవినీతి తప్ప ఏమీ లేదని ప్రజలు గుర్తిస్తున్నారని పురంధరేశ్వరి పేర్కొన్నారు.

నేటికీ సాగుతున్న ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం
ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసకర పాలన దేవుడి రధాలు తగలబెట్టే వరకు వెళ్లిందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. పాదయాత్రలు చేసి ప్రజలకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు తీరా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలు, బిజెపి నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని వైసిపి ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని, తద్వారా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రావాలని పేర్కొన్న పురంధరేశ్వరి ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు.
Recommended Video

అప్పుల కుప్పగా ఏపీ... టీడీపీపైనా పురంధరేశ్వరి ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అని మండిపడిన పురంధరేశ్వరి, ఏ ఒక్క బ్యాంకు ఏపీకి అప్పు ఇవ్వటానికి ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. ఒకపక్క పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇస్తూనే మరోవైపు లాక్కుంటున్నారంటూ నిప్పులు చెరిగారు . అమ్మఒడి పేరట 15000 రూపాయలు ఇస్తూ, మరోవైపు మద్యం పేరుతో లాక్కుంటున్నారని... ఆటోవాలాలకు పదివేల రూపాయలు ఇస్తూ, చలాన్ల బాదుడుతో తిరిగి వసూలు చేస్తున్నారని పురంధరేశ్వరి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనూ ఏపీకి అన్యాయం జరిగిందని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారని టీడీపీని గెలిపిస్తే న్యాయం చేయాల్సింది పోయి జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజలు రెండు సార్లు మోసపోయారని పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు.