విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచయిత v/s అశోక గజపతిరాజు: సింహాచల ఆలయానికి ప్రసాద్‌పై మాటల యుద్ధం, ట్వీట్ ఫైట్

|
Google Oneindia TeluguNews

మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు, మాజీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మధ్య ట్వీట్ పైట్ జరుగుతోంది. వారి మధ్య ఇప్పటికే వైరం ఉండగా.. తాజాగా సింహాచల అప్పన్న ఆలయానికి కేంద్ర ప్రభుత్వ 'ప్రసాద్'పథకంలో చోటు దక్కడంతో వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారని సంచయిత ప్రశ్నించగా.. అశోక గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ఏం చేశామో సహా ట్వీట్ చేశారు. అందుకు సంచయిత కూడా కౌంటర్ అటాక్ చేశారు.

సంచయిత మరో సంచలనం: అప్పుడేం చేశారు అశోక గజపతిరాజు, సింహాచల ఆలయానికి 'ప్రసాద్‌’లో చోటు..సంచయిత మరో సంచలనం: అప్పుడేం చేశారు అశోక గజపతిరాజు, సింహాచల ఆలయానికి 'ప్రసాద్‌’లో చోటు..

2017లోనే దరఖాస్తు చేశాం..

సింహాచల ఆలయానికి ప్రసాద్ పథకం కోసం 2017లోనే దరఖాస్తు చేశామని అశోక్ గజపతిరాజు ట్వీట్ చేశారు. అప్పటి సింహాచల ఆలయ ఈవో దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫార్వర్డ్ చేసిన ప్రతిని పోస్ట్ చేశారు. దీంతో తామే అంతా చేశానని చెబుతోన్న సంచయితకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే దీనిపై సంచయిత కూడా ట్వీట్లు చేశారు.

ఈవో ఎలా.. రాష్ట్ర ప్రభుత్వం కదా..?

కేంద్ర పథకాన్ని ఆలయానికి వర్తింపజేయాలని కోరుతూ ఈవో దరఖాస్తు చేయరని స్పష్టం చేశారు. ఆ పని చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమి తెలిపారు. సింహాచల ఆలయానికి ప్రసాద్ కోసం నాటి సీఎం చంద్రబాబు దరఖాస్తు చేయలేదు, మీరు సిఫారసు చేయలేదన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి.. అనుమతి తీసుకురాలేదని విమర్శించారు. కానీ తాను కోరిన వెంటనే సీఎం జగన్ స్పందించారని గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి పంపిన మూడు ఆలయాల్లో సింహాచలం ఒకటి అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రసాద్ పథకంలో చేర్చిందని గుర్తుచేశారు.

Recommended Video

GATE 2021 Dates, Eligibility Criteria Changed

టూరిజం శాఖ ప్రశంసలు

సింహాచలం దేవస్థానం ప్రసాద్ పథకానికి ఎంపికైన సందర్భంగా కేంద్ర టూరిజం విభాగం చేసిన ట్వీట్‌ను సంచయిత షేర్ చేశారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని టూరిజం శాఖ ట్వీట్ చేసింది. సంచయితను ప్రత్యేకంగా అభినందించింది. మరోవైపు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సంచయిత తెలిపారు. భక్తులకు సకల వసతులు కల్పిస్తామని.. సింహాచల అప్పన్న పేరు మారుమోగేలా చేస్తామని చెప్పారు.

English summary
sanchaita gajapati raju v/s ashoka gajapati raju, simhachalam temple prasad applied 2017 ashok said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X