Southwest Monsoon ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? వచ్చే మూడురోజుల అంచనాలివీ: రాయలసీమలో మరిన్ని
విశాఖపట్నం: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జోరందుకుంటోన్నాయి. క్రమంగా విస్తరిస్తోన్నాయి. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడురోజులకు సంబంధించి వర్ష సూచనలు, హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు తాజాగా జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోవచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Recommended Video
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకిన రుతుపవనాలు.. క్రమంగా విస్తరిస్తోన్నాయి. అవి విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. క్రమంగా కేరళా అంతటా విస్తరించాయని, కర్ణాటక, కోస్తా కర్ణాటక జిల్లాలు, తమిళనాడు దక్షిణ అంతర్గత ప్రాంతాల్లో ప్రవేశించినట్లు తెలిపారు. దీని ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి.

ఆయా రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుల సరిహద్దులకు ఆనుకుని ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తాయని, దీని ప్రభావం వల్ల వచ్చే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే మూడురోజుల్లో ఈ రుతుపవనాలు తెలంగాణ దక్షిణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి బలహీన పడినట్లు చెప్పారు. ఈ రెండూ బలహీన పడటం కూడా రుతుపవనాలు విస్తరించడానికి కారణమౌతున్నట్లు తెలిపారు. ఫలితంగా- వచ్చే మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4,5,6 తేదీల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించారు.
-
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!












Click it and Unblock the Notifications