వైఎస్సార్- చంద్రబాబు మధ్య తేడాలను వివరించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీలో అడుగు పెట్టారు. సాగరనగరం విశాఖపట్నంలో ఏపీ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభ ఇది.

ఒకే వేదికపై..

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో శనివారం సాయంత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్‌లో ఈ సభ ఏర్పాటైంది. ఏపీ కాంగ్రెస్ దీన్ని నిర్వహించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల సహా పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. పేద మహిళలకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని షర్మిలతో కలిసి ఆవిష్కరించారు.

Revanth Reddy

మోదీ బలం.. బలగం

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ- బీజేపీ అంటే బాబు-జగన్-పవన్‌ అని కొత్త అర్థం చెప్పారు. ఈ ముగ్గురూ మోదీకి బలం, బలగంగా మారారని విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా ఉపయోగం ఉండదని, వాళ్లంతా మోదీ దొడ్లోకి వెళ్లే వాళ్లేనని ఆరోపించారు.

నిలదీసే ధైర్యం వారికి ఉందా?

25 మంది ఎంపీలను గెలిస్తే- వాళ్లందరిని తీసుకెళ్లి మోదీ కాళ్ల వద్ద పెడతారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మోదీని నిలదీసే ధైర్యం వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేదని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఓటు వేయడం వ్యర్థమేనని అన్నారు. ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అన్నదమ్ములం..

విభజన తరువాత ఎంతగానో నష్టపోయిన ఏపీకి ఇప్పుడు కావాల్సింది పాలకులు కాదని, మోదీని ఢిల్లీలో నిలదీసే గొంతు కావాలని అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లందరం అన్నదమ్ములేనని, కలిసి మెలిసి ఉందామని, కేంద్రంతో పోరాడి తమ హక్కులను సాధించుకుందామని రేవంత్ రెడ్డి సూచించారు.

Revanth Reddy

షర్మిలను ఆదరించండి..

ఈ ఎన్నికల్లో షర్మిలమ్మను ఆదరించాలని, పెద్ద మనసుతో ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఎల్లప్పుడు ఆమె ప్రజలకు అండగా నిలబడుతారని, కష్టనష్టాల్లో తోడుగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఏపీ ఎన్నో ప్రయోజనాలను కల్పించడానికి ఉద్దేశించిన హక్కులను పునర్విభజన చట్టంలో పెట్టింది తామేనని గుర్తు చేశారు.

వైఎస్సార్ పేరు..

ఈ సభలో రేవంత్ రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ ఏనాడు కూడా మతపరమైన రాజకీయాలు చేయలేదని, బీజేపీతో అంట కాగలేదని చెప్పారు. కమ్యూనల్ శక్తులతో చివరివరకూ పోరాడారని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా, కేసులో పెట్టినా, జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినా.. ఓ ప్రజాస్వామ్యవాదిగా వైఎస్సార్ నిలిచారని చెప్పారు. కేసులు ఉన్నాయని భయపడి బీజేపీతో చేతులు కలపలేదని అన్నారు. కేసుల భయంతో ఇక్కడ బీజేపీతో జట్టు కట్టారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+