విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకగ్రీవాలకు ఓకే కానీ.. షరతులు వర్తిస్తాయి.. విశాఖ కలెక్టరేట్ సమీక్షలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్

|
Google Oneindia TeluguNews

ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బిజీగా ఉన్నారు. ఇటీవల రాయలసీమలో పర్యటించిన ఆయన ఇవాళ విశాఖపట్టణం, గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా విశాఖపట్టణంతో తన పర్యటన ప్రారంభించారు. అయితే ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదు అని ఇటీవల జరుగుతోన్న పరిణామాలను ఆయన వివరించారు. నిబంధనలకు అనుగుణంగా జరిగితే ఇబ్బంది లేదని చెప్పారు.

వంకాయ, క్యారెట్, కుర్చీ.. ఇవీ ఏపీ పంచాయతీ గుర్తులు, 25 గుర్తులకు ఎస్ఈసీ ఆమోదం..వంకాయ, క్యారెట్, కుర్చీ.. ఇవీ ఏపీ పంచాయతీ గుర్తులు, 25 గుర్తులకు ఎస్ఈసీ ఆమోదం..

పారదర్శకంగా..

పారదర్శకంగా..


పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన ఆయన.. జిల్లా వ్యాప్తంగా 20,118 పోలింగ్‌ సిబ్బందిని విధుల్లో ఉంటారని చెప్పారు. 3,999 బ్యాలెట్‌ బాక్సులు వినియోగిస్తామని పేర్కొన్నారు. అనకాపల్లి డివిజన్‌లో 3,306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

భర్తతో కాజల్ అగర్వాల్ రొమాంటిక్ మూమెంట్స్.. తరగని అందంతో

రాజ్యాంగం చెప్పినట్టుగానే..

రాజ్యాంగం చెప్పినట్టుగానే..

పంచాయతీ ఎన్నికల కోసం 8,642 మందిని పీవో, ఏపీవోగా నియమించామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమని తెలిపారు. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సూచించారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. స్వీయనియంత్రణకు కట్టుబడి ఉన్నామని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తేల్చిచెప్పారు.

Recommended Video

Atchannaidu Arrest : కింజ‌రపు కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు : ఎంపీ Rammohan Naidu
తూ.గో.. ప.గో జిల్లాల్లో పర్యటన..

తూ.గో.. ప.గో జిల్లాల్లో పర్యటన..

షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా అధికారులతో నిమ్గడ్డ రమేశ్ కుమార్ సమీక్ష చేస్తారు. రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో చర్చలు జరుపుతారు. ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశాలు జారీచేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరగనుండగా... 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది.

English summary
ap panchayat election unanimous agree but conditions apply sec nimmagadda ramesh kumar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X