విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ఉక్కు ఉద్యమం : కార్మికుల ఆగ్రహం .. మోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర, ఆపై దహనం

|
Google Oneindia TeluguNews

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా బీజేపీ మినహా మిగతా అఖిలపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇక పార్లమెంటులో సైతం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉపసంహరణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారు.

మదనపల్లె జంట హత్యల కేసు: విశాఖ మెంటల్ ఆస్పత్రి నుండి పురుషోత్తం నాయుడు ,పద్మజ డిశ్చార్ , తిరిగి జైలుకు మదనపల్లె జంట హత్యల కేసు: విశాఖ మెంటల్ ఆస్పత్రి నుండి పురుషోత్తం నాయుడు ,పద్మజ డిశ్చార్ , తిరిగి జైలుకు

 కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద మోడీ శవయాత్ర ,దిష్టిబొమ్మ దహనం

కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద మోడీ శవయాత్ర ,దిష్టిబొమ్మ దహనం

ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఇదే సమయంలో విశాఖ ఉక్కు కార్మిక పోరాటం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమంలో భాగంగా కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద శవయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు . ఆ పై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)

 రైతుల భారత్ బంద్ కు విశాఖ కార్మికుల మద్దతు

రైతుల భారత్ బంద్ కు విశాఖ కార్మికుల మద్దతు


విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించ వద్దని, మోడీ డౌన్ డౌన్ అంటూ ఆందోళన నిర్వహించారు. పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు.

కార్మికులు భారత్ బంద్ కు సైతం తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నలభై మూడు రోజులుగా ఉద్యమిస్తున్న కార్మికులు కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు . రైతులు, ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ బంద్ లో పాల్గొంటున్నామని విశాఖ ఉక్కు కార్మికులు ప్రకటించారు.

ఎంపీ రామోహన్ నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన విశాఖ ఉక్కు కార్మికులు

ఎంపీ రామోహన్ నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన విశాఖ ఉక్కు కార్మికులు

ఇదిలా ఉంటే ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన, రైతుల భారత్ బంద్ నేపథ్యంలో రైతులకు మద్దతుగా కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రిలే నిరాహార దీక్షలతో ఆందోళనలు కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు కార్మికులు పార్లమెంట్ వేదికగా విశాఖ ఉక్కు పరిరక్షణకోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఎదుట ఆందోళన కొనసాగించారు . విశాఖ ఉక్కు మా హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

English summary
Today, the workers are participating protest at kurmannapalem junction, as part of the Vishakha steel workers protest. The Prime Minister Narendra Modi effigy has been burnt out . The concern was held against the privatization of the Steel Plant, Workers also announced their absolute support to Bharat Bandh. It is clear that the workers who raise their voice for forty-three days aginst the steel plant privatization are contimue until the center is backwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X