vizag steel plant : 29 నుంచి కార్మికుల సమ్మె సైరన్- జగన్ లాబీయింగ్ ఫలించలేదా ?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసి వచ్చిన మూడు రోజుల్లోనే సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 29 నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు దిగనున్నట్లు కార్మిక సంఘాలు ఇవాళ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. దీంతో జగన్ ఢిల్లీ పర్యటనలో చేసిన లాబీయింగ్ ఫలించలేదని తేలిపోయింది. వాస్తవానికి ఢిల్లీ టూర్‌కు ముందే జగన్ ప్రధానికి రెండు లేఖలు రాయడంతో పాటు పార్లమెంటులోనూ ఎంపీలు పోరాడారు. అప్పుడే కేంద్రం వెనక్కి తగ్గబోమని తేల్చేసింది.
Recommended Video

మళ్లీ తెరపైకి స్టీల్ ప్లాంట్ పోరు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ గతంలో భారీ ఎత్తున ఆందోళనలు చేసిన కార్మిక సంఘాలు కరోనాతో కొద్దిగా శాంతించాయి. తిరిగి కరోనా ప్రభావం తగ్గడంతో మరోసారి ఆందోళనలకు దిగుతున్నాయి. కార్మికులు చేపట్టిన ఉద్యమం 124 రోజులకు చేరుకోగా.. ఇప్పటికీ రిలే దీక్షలు, విన్నూత్న నిరసనలతో కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదన్న సంకేతాల నేపథ్యంలో మలి విడత ఉద్యమానికి కార్మికులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్న కార్మిక సంఘాలు..ఇక పోరును తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగాలని అఖిలపక్ష కార్మికసంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు యాజమాన్యానికి ఇవాళ నోటీసులు ఇచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్న పరిశ్రమల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. దీంతో అధికారికంగా సమ్మె సైరన్ మోగించినట్లయింది.

జగన్ లాబీయింగ్ విఫలం ?
తాజాగా ఢిల్లీ టూర్ సందర్భంగా కేంద్రమంత్రుల్ని కలిసిన సీఎం జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతకుముందే ప్రధాని మోడీకి సైతం రెండు లేఖలు రాసిన జగన్.. ఈసారి స్వయంగా కేంద్రమంత్రుల్ని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే కేంద్ర మంత్రులు సైతం ఆయనకు నిర్దిష్ట హామీ ఏదీ ఇవ్వలేదు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున దీనిపై వారు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. దీంతో ఇప్పుడు అంతిమ నిర్ణయంగా కార్మిక సంఘాల సమ్మె తప్పనిసరిగా మారింది.

ప్రైవేటీకరణ ఆర్దిక రహస్యమన్న కేంద్రం
మరోవైపు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థికశాఖ నిరాకరించింది. ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన సమాచారానికి సమాధానమిస్తూ..'ఉక్కు'లో పెట్టుబడుల ఉపసంహరణ ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని వెల్లడించింది. ఆర్‌ఐఎన్‌ఎల్ విక్రయంపై సమాచారం గోప్యమని ఆర్థిక శాఖలోని డీఐపీఏఎం పేర్కొంది. కాగా, గతంలో జగన్, చంద్రబాబు లేఖలకు జవాబివ్వాలని పీఎంవో కోరినా డీఐపీఏఎం పట్టించుకోలేదు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications