గీతం టార్గెట్ గా .. వేల కోట్లు నోట్లకట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా ? ప్రశ్నించిన ఎంపీ
టిడిపి నాయకుడు, చంద్రబాబుకు బంధువు, బాలయ్య అల్లుడు అయిన భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేత పై ఏపీలో దుమారం రేగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది కేవలం కక్షసాధింపు చర్య అని చెప్పి విమర్శలు గుప్పిస్తుంటే, అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తే తప్ప అంటూ వైసిపి నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. చంద్రబాబు బంధువు అయితే అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చ కూడదా అని ప్రశ్నిస్తున్నారు.

తెలుగు జాతి థూ అని ఉమ్మెయ్యాల్సిన సమయం ఇది
చంద్రబాబుని టార్గెట్ చేసి వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పునాది రాయి వేయించి, తను కలలు కన్న రాజధానిని కట్టాల్సిన బాధ్యత జగన్ గారిదని వంద రాళ్ళు వేస్తుంటే, తన బినామీ భూముల భాగోతం బయటకు రాకుండా ఏకంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి తెలుగు జాతి థూ అని ఉమ్మెయ్యాల్సిన సమయం ఇది అంటూ చంద్రబాబును ఉద్దేశించి విజయ సాయి రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆ గేదె చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది
అంతేకాదు గీతం యూనివర్సిటీ కూల్చివేతనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా విమర్శించిన విజయసాయిరెడ్డి 28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూములలో వేల కోట్లు నోట్లకట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా అంటూ పోస్ట్ చేశారు.
అంతేకాదు అక్రమ కట్టడాలను చట్టప్రకారం కూల్చేస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తీనోరు కొట్టుకుంటోంది.

పేదలు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీని గురించి ఒకరు మాట్లాడలేదు
ఆంధ్ర యూనివర్సిటీ దెయ్యాల కొంపని సదరు అక్రమదారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీని గురించి ఒకరు మాట్లాడలేదు . పేదల ప్రయోజనాల కన్నా పచ్చ నాయకుని ప్రయోజనాలు ఎక్కువైపోయాయా అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని నాశనం చేసి, గీతం యూనివర్సిటీ ని ప్రోత్సహించడంతోనే పరిస్థితి ఈ విధంగా మారిందని, పేదల చదువుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఈ వ్యాఖ్యల ద్వారా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Recommended Video

పుట్ట పగలుతుంటే తట్టుకోలేకపోతోంది
అంతేకాదు పాలనాధికారం అంటే ప్రజలకు సేవచేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. కానీ పచ్చ పార్టీ దీనికి భిన్నం . దోపిడీలు ,ఆక్రమణలు ,తవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్ని రకాల మాఫియాలను ప్రోత్సహించింది. ఇప్పుడు పుట్ట పగలుతుంటే తట్టుకోలేకపోతోంది అంటూ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. గీతం యూనివర్సిటీ కూల్చివేత పై టిడిపి నాయకుల వ్యాఖ్యలకు ఆయన సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications