• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ ఆప్యాయతకు ఫ్యాన్స్ ఫిదా.. గ్యాస్ లీక్ బాధితుల పరామర్శలో అరుదైన సీన్స్...

|

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. తెరవెనుకే ఉండిపోయిన వైఎస్ జగన్.. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించారు. ఆరంభంలో ఓదార్పుయాత్ర చేపట్టినా, ఆ తర్వాత పాదయాత్ర చేపట్టినా జనంతో జగన్ కలిసిపోయే తీరే వేరు. పేదలతో కలిసిపోయి వారిలో ఒకడిగా మాట్లాడుతూ జగన్ ఇచ్చిన హామీలే ఆయన్ను ఏపీలో ఎన్నడూ లేనంత భారీ స్ధాయి మెజారిటీతో అధికారాన్ని సైతం కట్టబెట్టాయి. అధికారం చేపట్టిన తర్వాత కాస్త బిజీగా మారినా తనలో ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని ఇవాళ విశాఖ గ్యాస్ లీకేజీ బాధితుల పరామర్శ ద్వారా మరోసారి నిరూపించారు.

fact check : జగన్ హెలికాఫ్టర్ లో సాయిరెడ్డికి చోటు నిరాకరణ..! అసలేం జరిగిందంటే ?

విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై సమాచారం అందగానే ఉదయం నుంచీ అధికారులను అప్రమత్తం చేసిన సీఎం జగన్.... వెంటనే సీనియర్ అధికారులను ఘటనా స్ధలికి పంపి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నా లెక్కచేయకుండా వెంటనే అప్పటికప్పుడు విమానాన్ని సైతం సిద్ధం చేయించి విశాఖ పయనమయ్యారు. సీఎం రాకతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. గంటల వ్యవధిలోనే పరిస్దితిని అదుపులోకి తీసుకొచ్చారు. జగన్ విశాఖలో అడుగుపెట్టగానే ఘటనా స్దలిని సందర్శించాక ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

ys jagan shows his affection once again at vizag gas leakage victims

దాదాపు గంటసేపు ఆస్పత్రిలోనే ఉన్న జగన్... బాధితులను ఒక్కొక్కరిగా కలుసుకుంటూ వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రుల కుటుంబాలకు పది లక్షల సాయం అక్కడికక్కడే ప్రకటించారు.

ys jagan shows his affection once again at vizag gas leakage victims

అంతే కాదు బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకునేలా అక్కడి నుంచే ఆదేశాలు ఇచ్చారు. ఇదంతా ఓ ఎత్తయితే కుటుంబ సభ్యుల తరహాలో బాధితులపై చేతులు వేసి మాట్లాడుతూ అక్కడే ఉన్న వారందరినీ జగన్ ఆశ్చర్య పరిచారు. నిత్యం ప్రభుత్వ పాలనలో కరకుగా కనిపించే జగన్.. బాధితులతో ఆప్యాయంగా మాట్లాడటం చూసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఏ సాయం కావాలన్నా అడగాలని బాధితులను కోరిన జగన్ అక్కడి నుంచి వెనుదిరిగారు.

ys jagan shows his affection once again at vizag gas leakage victims
  Visakhapatnam Gas Leak : Gas Neutralised, 8 km Radius Treated With Sea Water

  అయితే జగన్ వైజాగ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా వంగి బాధితులపై చేతులు వేసి మాట్లాడడం ద్వారా జగన్ వారికి అంతులేని భరోసా ఇచ్చారని ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

  English summary
  andhra pradesh chief minister ys jagan mohan reddy proves his affection towards downtrodden people in the society once again as vizag gas leak incident victims are pleased with his gestures today.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X