రాంబాబు సైకోలా ఇందుకు మారాడు, భార్య అలా చేయడంతో.. కూతురు, కుమారుడు కూడా
వారం రోజుల్లో మూడు హత్యలు.. హత్యలు ఎవరు చేశారనే అంశాన్ని పోలీసులు కనుగొన్నారు. పెందుర్తిలో సీరియల్ మర్డర్లను పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. సైకో కిల్లర్ రాంబాబును అరెస్ట్ చేశారు. సైకో కిల్లర్‌ను అదుపులోకి తీసుకున్నామని, నిందితుడు అనకాపల్లి జిల్లా కోటవురట్ల గ్రామవాసి అని పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.
ఏం జరిగిందనే విషయాన్ని కమిషనర్ మీడియాకు వివరించారు. రాంబాబు భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పారు. 2018లో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. తీవ్ర ఒత్తిడికి లోనై మానసికంగా కుంగిపోయాడని వివరించారు. అప్పటినుంచి మహిళలపై కక్ష పెంచుకుని హత్యలకు పాల్పడుతున్నాడని వివరించారు. రాంబాబు వారం కిందట వాచ్ మన్ దంపతులను హత్య చేశాడని వెల్లడించారు. మరో మహిళను హత్య చేశాడని, మరొకరిపై హత్యాయత్నం చేశాడని వివరించారు. గత కొన్నినెలలుగా రాంబాబు మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. అద్దెకు ఉంటున్న ఇంట్లో క్షుద్రపూజలు చేసేవాడని, దేవుడు వస్తున్నాడంటూ కేకలు వేసేవాడని సీపీ తెలిపారు. అతడిని కోర్టులో హాజరు పరిచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు.

రాంబాబుకు 30 ఏళ్ల కిందే పెళ్లి అయ్యిందని.. అతడికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారని సీపీ తెలిపారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మానసికంగా దెబ్బతిన్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో యజమాని చేతిలో మోసపోవడంతో మరింత కుంగిపోయాడు. అక్కడి నుంచే హత్యలకు శ్రీకారం చుట్టాడు. హత్య చేసిన తర్వాత మృతుల మర్మాంగాలపై తన్నేవాడట. భార్యకు విడాకులు ఇచ్చాక అతడిని కుమార్తె, కుమారుడు కూడా దూరంగా ఉంచడంతో వ్యక్తుల పట్ల ద్వేషం మరింత పెరిగిందట.
వాచ్ మన్ దంపతుల హత్య కేసు విచారణ ఆలస్యమైంది. నిందితుడి వద్ద మొబైల్ లేకపోవడంతో విచారణ నెమ్మగించింది. పొదల్లోంచి వస్తున్న రాంబాబును ప్రశ్నించగా, అతడు చెప్పిన సమాధానాలు పోలీసులకు అనుమానాలు కలిగించాయి. అదుపులోకి తీసుకుని విచారిస్తే మహిళల హత్యల గురించి తెలిసింది.












Click it and Unblock the Notifications