ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గజపతినగరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009 వరకు ఉన్న ఉత్తరాపల్లి నియోజకవర్గాన్ని రద్దు చేసారు. ఉత్తరాపల్లి నియోజకవర్గం లో కరుసగా అయిదుసార్లు గెలిచిన కోళ్ల అప్పలనాయుడు టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ఇక, గజపతినగరం నుండి బొత్సా సోదరుడు అప్పలనర్సయ్య 2014 ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడి నుండి రెండు సార్లు గెలిచి న పెనుమత్స సాంబశివరాజు సతివాడ నియోజకర్గంలో ఆరు సార్లు గెలిచారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పడాల అరుణ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడ బొత్సా కుటుంబం ఆధిపత్యానికి చెక్ పెడుతూ తిరిగి టిడిపి అభ్యర్ధి గెలిచారు.
14 సార్లు ఎన్నికలు.. కీలక పోరు..
గజపతినగరం నియోజకవర్గంలో 1955 నుండి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి నాలుగు సార్లు, ప్రజా సోషలిస్టు పార్టీ రెండు సార్లు, జనతాపార్టీ ఒకసారి, ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. ఇక, 1983 నుండి ఇక్కడి టిడిపి - కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు ఉంది. 2014 ఎన్నికల్లో టిడిపి-వైసిపి-కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ ఈ జిల్లాలో మాత్రం బొత్సా కుటుంబం నుండి పోటీ చేసిన నియోజకవర్గాల్లో డిపాజిట్ నిలబెట్టుకున్నారు. 2009 లో కాంగ్రెస్ నుండి గెలిచిన బొత్సా అప్పలనరసయ్య 2014 ఎన్నిక ల్లో మూడో స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 187966 ఓట్లు ఉండగా, మొత్తం 158996 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడి నుండి పోటీ చేసిన టిడిపి అభ్యర్ధి కె అప్పలనాయుడుకు 65117, వైసిపి అభ్యర్ధి కె శ్రీనివాసరావుకు 45694 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుం డి పోటీ చేసిన అప్పలనరసయ్య కు 44325 ఓట్లు వచ్చాయి. కాగా , టిడిపి అభ్యర్ధి 19423 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొత్సా కుటుంబం పూర్తిగా వైసిపి లో చేరింది. అప్పటి నుండి జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పు మొదలైంది. ఇక, 2014 ఎన్నికల కోసం టిడిపి - వైసిపి మధ్య ఇప్పటికే ఎత్తులు పై ఎత్తులు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications