ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజయనగరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా విజయనగరం మండలం, మున్సిపాల్టీలను చేర్చి ఈ నియోజకవర్గం ఏర్పా టు చేసారు. ఒకే నియోజకవర్గం నుండి ఏడు సార్లు గెలిచిన నేతగా ఇదే నియోజకవర్గం నుండి ఆశోక్ గజపతి రాజు రికార్డు సృష్టించారు. సుదీర్గ కాలం మంత్రి పదవులు నిర్వహించారు.అశోక్ తండ్రి విజయనగరం రాజా గా ప్రసిద్ది గాంచిన పూస పాటి విజయరామ గజపతి రాజు సైతం ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. విజయనగరంలో మూడు సార్లు, భీముని పట్నంలో మూడు సార్లు గెలుపొందారు. అశోక్ సోదరుడు ఆనంద్ గజపతి రాజు సైతం ఒకసారి ఎమ్మెల్యేగా..రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక, 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
16 సార్లు ఎన్నికలు.. నాన్ కాంగ్రెస్ పార్టీలకే ఆదరణ..
విజయనగరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. తెలుగుదేశం ఏడు సార్లు గెలవగా.. సోషలిస్టు, ప్రజా సోషలిస్టు పార్టీలు కలిసి నాలుగు సార్లు. జనసంగ్, జనతా పార్టీలు ఒకొ క్కసారి చొప్పున గెలుపొందాయి. 1955 లో గెలిచిన పివిజి రాజు ఆ తరువాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. భాట్లం శ్రీరామ మూర్తి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కొలగల్ల వీరభద్రస్వామి ఇక్కడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి అశోక్ గజపతి రాజు మీద గెలుపొందారు. 2009 ఎన్నికల్లో తిరిగి అశోక్ గజ పతి రాజు టిడిపి నుండి గెలిచారు.

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం ఓటర్లు 216301 ఉండగా, అందులో 154058 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన మీసాల గీత77820 ఓట్లు దక్కించుకోగా, వైసిపి నుండి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కె వీరభద్ర స్వామి 61916 ఓట్లు దక్కించుకున్నారు. టిడిపి అభ్యర్ధి గీత 15404 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అశోక్ గజపతి రాజు విజయనగరం ఎంపీగా పోటి చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్ధి ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి 28341 ఓట్లు దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications