విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబాయ్‌ అశోక్‌గజపతిరాజుపై సంచైత నిప్పులు- అంతా మీరే చేశారు- ఇప్పుడేమీ తెలియనట్లు...

|
Google Oneindia TeluguNews

విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ఆమె బాబాయ్‌, ట్రస్టు మాజీ ఛైర్మన్ అశోక్‌ గజపతిరాజు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాటికి ఆమె అంతే దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ట్రస్టుకు చెందిన మహారాజా కళాశాల ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలపై అశోక్‌ గజపతిరాజు ఆరోపణలకు దిగారు. ఎంఆర్‌ కాలేజీ ప్రైవేటు ఆస్తి కాదంటూ సంచైతకు చురకలు అంటించారు. దీనిపై తాజాగా సంచైత స్పందించారు. మీ హయాంలో చేయాల్సిదంతా చేసి ఇప్పుడు నాపై విమర్శలు చేస్తే ఎలా అంటూ ఆమె సోషల్‌ మీడియాలో ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.

సంచైత మరో సంచలనం.. ప్రైవేటు చేతుల్లోకి చారిత్రక విజయనగరం మహారాజా కాలేజ్‌..సంచైత మరో సంచలనం.. ప్రైవేటు చేతుల్లోకి చారిత్రక విజయనగరం మహారాజా కాలేజ్‌..

ఎంఆర్‌ కాలేజీ ప్రైవేటీకరణపై అశోక్...

ఎంఆర్‌ కాలేజీ ప్రైవేటీకరణపై అశోక్...

విజయనగరంలో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన పూసపాటి రాజవంశీకులకు చెందిన మహారాజా కాలేజ్‌ ఉంది. దీని ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వానికి మాన్సాస్‌ ట్రస్టు నుంచి గతంలో ప్రతిపాదనలు వెళ్లాయి. అవి ఇప్పుడు తుది దశలో ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న మహారాజా కాలేజీని ప్రైవేటీకరించడంపై విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో స్పందించిన మాన్సాస్‌ మాజీ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు ఇదేమీ ప్రైవేటు ఆస్తి కాదంటూ ఎవరికి పడితే వారికి ధారాదత్తం చేయడానికి అంటూ సంచైతపై నిప్పులు చెరిగారు. ఎంఆర్‌ కాలేజీ విజయనగరం చరిత్రతో ముడిపడిన అంశమని, దీన్ని ఎందుకు ప్రైవేటుపరం చేయాలని అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బాబాయ్‌కు సంచైత కౌంటర్‌..

బాబాయ్‌కు సంచైత కౌంటర్‌..

ఎంఆర్‌ కాలేజీ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని బాబాయ్ అశోక్‌ గజపతిరాజు వేసిన ప్రశ్నకు మాన్సాస్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో సంచైత గట్టిగా బదులిచ్చారు. ఎంఆర్‌ కాలేజీపై సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అయిన అశోక్‌ గజపతిరాజు గారు తప్పుడు సమాచారం ఇస్తుండటం తనకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని తాను ఊహించలేదన్నారు. ఎంఆర్‌ కాలేజీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రైవేటు కాలేజీ అని సంచైత పేర్కొన్నారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతోందన్నారు. దీనిపై రాద్ధాంతం ఎందుకన్నారు.

ఎయిడెడ్‌ హోదా వద్దంది ఆయనే...

ఎయిడెడ్‌ హోదా వద్దంది ఆయనే...

2017లో కాలేజీకి ఎయిడెడ్‌ హోదాను వద్దన్నది అశోక్ గజపతి రాజేనని, అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోందని సంచైత వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ జోక్యం కానీ, సంబంధం కానీ లేదన్నారు. ఈ విషయాన్ని విస్మరించి ఇప్పుడు అశోక్‌ విమర్శలు చేయడమేంటన్నారు. దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్‌ విద్యాసంస్ధలను లాగొద్దన్నారు. గతంలో మాన్సాస్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అశోక్‌ ఇచ్చిన తప్పుడు వివరాల వల్ల మాన్సాస్‌ కాలేజీలకు రూ.6.5 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అప్పటి టీడీపీ సర్కారుకు ఆయన ఈ డబ్బు డిస్కౌంట్‌గా ఇచ్చారేమో అని సంచైత అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైసీపీ సర్కారు నుంచి ఈ డబ్బు వెనక్కి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు సంచైత వెల్లడించారు.

Recommended Video

AP CM Jagan Inaugurated Pattas Distribution to Tribals గాంధీ జయంతి రోజున గిరిజనుల దశాబ్దాల కల సాకారం
గాంధీ జయంతిరోజైనా నిజం మాట్లాడాలని...

గాంధీ జయంతిరోజైనా నిజం మాట్లాడాలని...


అశోక్‌ గజపతిరాజు హయాంలో సరైన అనుమతులు లేని కారణంగా 2018-20లో 170 మంది విద్యార్ధులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయని, ఆయన విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకున్నారని సంచైత నిప్పులు చెరిగారు. తాను వచ్చాక ఈ సమస్యపై దృష్టిపెట్టానని సంచైత తెలిపారు. అశోక్‌ గారు తన రాజకీయ ఆటల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఓసారి ఆలోచించుకోవాలని సంచైత బాబాయ్‌కి హితవు పలికారు. కనీసం గాంధీ జయంతి రోజైనా నిజం మాట్లాడాలని అశోక్‌కు సంచైత చురకలు అంటించారు.

English summary
mansas trust chairperson sanchaita gajapati raju on friday given strong counter to his uncle and former chairman ashok gajapati raju's remarks on privatization of maharaja college in vizianagaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X