వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దంపతుల ఆత్మహత్య.. అనాథులుగా మారిన చిన్నారులు.. కన్నీరు పెట్టిస్తున్న విషాద గాథ..

|
Google Oneindia TeluguNews

జీవితం అంటే పోరాటం అంటారు.. ఈ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అయితే చాలా మంది జీవితంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కొలేక తనువు చాలిస్తుంటారు. అన్ని సమస్యలకు చావొక్కటే మార్గమని భావిస్తుంటారు. కొందరు కన్నవాళ్లకు కుడుపు కోత మిగిలిస్తే.. మరి కొందరు కన్నొళ్లను అనాథలను చేస్తున్నారు. తాజాగా వరంగల్ లో ఆర్థిక సమస్యలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి పిల్లలను అనాథలను చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఉప్పల సతీశ్‌ అలియాస్‌ నవధన్‌, భార్య స్రవంతి బతుకు దెరువు కోసం వరంగల్ వచ్చారు. వీరికి ద్దరు కుమారులు విరాట్, విహార్‌ ఉన్నారు.

సతీశ్‌ కు జగిత్యాలలో సరిగా ఉపాధి లేక వరంగల్ వచ్చారు. వరంగల్ వచ్చిన సతీశ్ కార్లు కొని అద్దెకు ఇవ్వడం, అమ్మడం చేశాడు. అదీ కలిసిరాక వస్త్ర వ్యాపారం ప్రారంభించినా ఫలితం కనిపించలేదు. ఇంట్లో వృద్ధాప్యంలో అమ్మనాన్న. ఇటు భార్యా, ఇద్దరు పిల్లలు.. కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో పాటు అప్పులు కూడా పెరిగాయి. చివరికి ఇంటి అద్దె కట్టలేని పరిస్థితికి వచ్చాడు. మరోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. సతీశ్ కు రూ.15 లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది. ఏం చేయాలో తెలియక తనకు చావే శరణ్యమని భార్యతో చెప్పాడు. దీంతో మీరు పోతే నేను పిల్లలు బతకలేమని.. మేం మీతోనే వస్తామని చెప్పింది.

A couple committed suicide due to financial problems in Warangal
ముందుగా పిల్లలకు విషమిచ్చి తర్వాత తాము తాగాలని వారు నిర్ణయించుకున్నారు. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగుపెట్టే సైనేడ్‌ను వాటర్‌బాటిళ్లలో కలుపుకున్నారు. ముందుగా పెద్ద కుమారుడికి ఇది దేవుడి తీర్థం నాన్న అని చెప్పి రసాయనం ఉన్న సీసా ఇవ్వగా నోట్లో పోసుకోగానే రుచి నచ్చక ఉమ్మేశాడు. ఆ తర్వాత సతీశ్‌, స్రవంతి తాగారు. కాసేపటికే కింద పడిపోయారు. దీంతో విరాటు మరో గదిలో ఉన్న నానమ్మకు ఈ విషయం చెప్పాడు. ఆమె హుటాహుటిన వచ్చి చూసేసారికి వారు స్పృహ తప్పి పడిపోయారు. స్థానికుల సహాయంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

దంపతుల మృతితో పిల్లలు అనాథులుగా మారారు. వృద్ధాప్యంలో ఉన్న నాన్నమ్మ, తాతయ్యపై పిల్ల బాధ్యత పడింది. ఎలాంటి పని చేయలేని వారు ఆ పిల్లల్ని ఎలా పోషిస్తారో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అమ్మ లేవు.. నాన్న లేవు అని ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారు కన్నీటిపర్యంతం అవుతున్నారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

English summary
A couple committed suicide due to financial problems in Warangal. As a result, their children became orphans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X