Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోనె సంచుల నుంచి.: కడియం శ్రీహరి ఆస్తులపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు

వరంగల్: స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, మరోసారి కడియంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు తాటికొండ రాజయ్య. ఈసారి వ్యక్తిగత విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఆరుద్ర పురుగుల్లా కడియం ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నువ్వు(కడియం) ఎమ్మెల్యే కాకముందు నీ ఇంటి కిటికీలకు గోనె సంచులు ఉండే. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయి. నీతిమంతుడని మాట్లాడుతున్నావు. నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో నువ్వు అంతే. కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలం అంటూ ధ్వజమెత్తారు రాజయ్య.

BRS MLA thatikonda rajaiah hits out at mlc kadiyam Srihari

మంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం పనిచేశావో అన్ని నాకు తెలుసు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. అవసరం వచ్చినప్పుడు పుస్తకం బయటపెట్టి.. నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో.. అన్నీ బయటపెడతా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని కుదవపెట్టి సింగపూర్‌, మలేషియాలో ఆస్తులు సంపాదించావు అని కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు.

2014, 2018 ఎన్నికల కోసం నా ఆస్తులన్నీ అమ్ముకున్నా. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్న చరిత్ర నాదయితే.. ఆస్తులు కొనుకున్న చరిత్ర నీది(కడియం శ్రీహరి). ఎప్పుడు రానిది మళ్లీ మీ(ప్రజలు) ముందుకు ఊసరవెల్లి మాదిరగా వస్తున్నాడు. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ దొంగచాటు మీటింగులు పెడుతున్నావు. నువ్వు నిజమైన బీఆర్ఎస్ నాయకుడివి అయితే రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టు. నువ్వు నేను చూసుకుందాం. పార్టీ నుంచి బహిష్కరించినవారు మాత్రమే నీతో ఉంటున్నారు. పార్టీపై అసంతృప్తులుగా ఉన్న వాళ్లే నీ వెంట ఉంటున్నారు అంటూ కడియంపై విమర్శలు చేశారు రాజయ్య.

ఈరోజు నుంచి ఎన్నికలు జరిగే వరకు ప్రతిరోజు తిరుగుతాను. ప్రతి ఊరిలోనూ డప్పు కొడతాను. ఓటర్లకు పైసలు ఇచ్చి గెలిచే రోజులు పోయాయి. నియోజకవర్గంలో నాలా పరుగెత్తాలంటే నీ గుండె ఆగిపోతుంది. ప్రతిపక్షాల పప్పులు ఉడక్కుండా చేసిన మొండి కేసీఆర్ అయితే.. అంతకు మించిన జగమొండిని నేను. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ రోజు కూడా కొబ్బరికాయ కొట్టని నేతలు కూడా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. 20 ఏళ్లుగా నియోజకవర్గానికి, ప్రజలకు దూరమై.. వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ రాజకీయాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటున్నావు అంటూ కడియంపై రాజయ్య విరుచుకుపడ్డారు. కాగా, ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఇలా విమర్శలు చేసుకోవడం నియోజకవర్గంలోనేగాక, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+