కేసీఆర్‌పై ఈటల ఫైర్.. దోచుకోవడమే పని అంటూ విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గుస్సా అయ్యారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని అనుకున్నారని ఆరోపించారు. ప్రజా ధనం దోచుకోవడమే పరామవధి అని విమర్శించారు. ప్రజల నెత్తిన అప్పుల కుప్ప తప్ప.. కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బుల సంచులు గుమ్మరించినా.. ప్రజల అభిమానం తాను మరవలేదని చెప్పారు.
హుజురాబాద్ ఎన్నికలు కేసీఆర్ దౌర్జన్యాన్ని, డబ్బును, అహంకారాన్ని అనగదొక్కడానికి జరిగిన ఎన్నికలని ఈటల రాజేందర్ అన్నారు. తన గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సామాన్య జనం కూడా పూజలు నిర్వహించారని గుర్తుచేశారు. హుజురాబాద్ గెలుపు ధర్మం, న్యాయం, తెలంగాణ గెలుపుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తనను గెలవకుండా, ఓడగొట్టడం కోసం కేసీఆర్ కుట్రలు పన్నడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టడానికి కుట్ర చేయడం లేదని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ కుట్రను అనణదొక్కుతామని చెప్పారు. కేసీఆర్, వారి కుటుంబం ప్రాంతీయ పార్టీల ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని నిండుగా దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసే జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
అంతకుముందు రాష్ట్రంలో రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతదని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ రైతులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని అడిగారు. రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వరి పంట వేయొద్దని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. వానాకాలం పంటలో రా రైస్ మాత్రమే ఉంటుందన్నారు. బియ్యం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
వర్షాకాలం వడ్లన్నీ వెంటనే కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. యాసంగిలో వచ్చే పంటపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతుల ఉసురుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. టీఆర్ఎస్ మొసలి కన్నీటిని రైతులు నమ్మొద్దని సూచించారు. రైతాంగానికి బీజేపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications