యూనివర్సిటీల ఫేక్ సర్టిఫికెట్లు; కన్సల్టెన్సీలతో కలిసి దందా: విదేశాలకు విద్యార్థులను పంపే గ్యాంగ్ అరెస్ట్!!

వరంగల్ కమిషనరేట్ పోలీసులు నేర పరిశోధనలో దూకుడు చూపిస్తున్నారు. ఇటీవల నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ లను చేస్తున్న ముఠాలను, బెయిల్ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు, తాజాగా దేశంలో గుర్తింపు కలిగిన వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.

నకిలీ యూనివర్సిటీల సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 12 మంది ముఠా అరెస్ట్

నకిలీ యూనివర్సిటీల సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 12 మంది ముఠా అరెస్ట్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్న 12 మంది సభ్యుల ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక ఈ ముఠా సభ్యుల నుండి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్ ట్యాప్ లు ,1 ఐపాడ్ ,2 ప్రింటర్లు ,5 సిపియూలు ,25 నకిలీ రబ్బర్ స్టాంపులు ,2 ప్రింటర్ రోలర్స్ ,5 ప్రింటర్ కలర్స్ బాటిల్స్ ,1 లామినేషన్ మిషన్ ,12 సెల్ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిన్నగా మొదలెట్టిన దందా ... డబ్బులు ఎక్కువ రావటంతో ఓ పెద్ద రాకెట్ గా

చిన్నగా మొదలెట్టిన దందా ... డబ్బులు ఎక్కువ రావటంతో ఓ పెద్ద రాకెట్ గా

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల మేరకు, ఈ సభ్యుల ముఠాలో ప్రధాన నిందితుడైన దారా అరుణ్ , ఆకుల రవిఅవినాష్ ఇద్దరు ప్రధాన నిందితులు . వీరిద్దరూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగివుండటంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ నెట్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. ఈ నెట్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం తన జీవనానికి సరిపోకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవాలని భావించిన వీరు చిన్నచిన్న నకిలీ సర్టిఫికెట్లను తయారుచేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఈ దందా బాగుందని భావించి పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు.

కన్సల్టెన్సీ లతో కలిసి దేశంలోని వివిధ ప్రముఖ యూనివర్సిటీల ఫేక్ సర్టిఫికెట్లు తయారీ

కన్సల్టెన్సీ లతో కలిసి దేశంలోని వివిధ ప్రముఖ యూనివర్సిటీల ఫేక్ సర్టిఫికెట్లు తయారీ

విద్యార్థులకు కావల్సిన దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసివ్వటం మొదలు పెట్టారు. ప్రధాన నిందితులు దార అరుణ్ , ఆకుల రవి అవినాష్ సహకారంతో హన్మకొండ పరిధిలోని కొన్ని కన్సల్టెన్సీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే వ్యక్తులు , విద్యార్థులకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా ఆయా కన్సల్టెన్సీ యాజమాన్యం తమ కావల్సిన విద్యాసంస్థలకు సంబంధించిన సర్టిఫికెట్ ను తయారు చేయాల్సిందిగా నిందితుడు దార అరుణ్ , ఆకుల రవి అవినాష్ కు సమాచారం ఇచ్చేవారు. ఇక కన్సల్టెన్సీ వారితో కుమ్మక్కై నిందితులు ఆరుణ్ , అవినాష్ లు నకిలీ సర్టిఫికెట్ లను తయారుచేసి తిరిగి కన్సల్టెన్సీ లకు అందించేవారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థలు విద్యార్థులను ఎలాంటి విద్యార్హత లేకున్నా విదేశాలకు పంపేవారు .

విదేశీ యూనివర్సిటీలకు కావాల్సిన విధంగా మార్కులు దిద్దటం, ఒకేసారి పాస్ అయినట్టు మార్చటం,

విదేశీ యూనివర్సిటీలకు కావాల్సిన విధంగా మార్కులు దిద్దటం, ఒకేసారి పాస్ అయినట్టు మార్చటం,

అదే విధంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారు చేసే ఈ ముఠా మరో అడుగు ముందుకేసి కొన్ని విదేశాల్లోని విద్యాలయాల్లో అడ్మిషన్ పొందేందుకుగాను కనీస మార్కుల శాతాన్ని తప్పనిసరి చేయడంతో, ఆయా యూనివర్సిటీలలో చావాలనే ఉత్సాహం ఉన్నవారికి వారికి కావలసిన విధంగా విద్యార్ధుల ఒరిజినల్ మార్కుల సర్టిఫికెట్ ను ఆధారంగా చేసుకోని కావల్సిన అధిక మార్కులతో కూడిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి అందించేవారని వెల్లడించారు . అలాగే విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై వుండాలని కొన్ని విదేశీ విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు నియమం పెట్టడంతో ఈ నియమాన్ని సైతం ముఠా సభ్యులు తమ అనుకూలంగా మార్చుకోని వివిధ సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారి సర్టిఫికెట్లలో మొదటి ప్రయత్నంలోనే పాస్ అయినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసే అందించేవారు.

నకిలీ సర్టిఫికెట్ లకోసం లక్ష నుండి నాలుగు లక్షల వరకు వసూళ్లు

నకిలీ సర్టిఫికెట్ లకోసం లక్ష నుండి నాలుగు లక్షల వరకు వసూళ్లు

ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విధ్యార్థులను విదేశాలకు పంపించేందుకుగాను అవసరమయిన పత్రాలను రూపొందించినందుకుగాను ఈ ముఠా ఒక లక్ష రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బును వసూలు చేసేవారని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు తాము తయారు చేసిన సర్టిఫికెట్లపై ఎవరికి అనుమానం రాకుండా నిందితులు విదేశాల నుండి సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమయిన కాగితాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారు .

పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు .. నకిలీ ముఠా గుట్టు రట్టు

పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు .. నకిలీ ముఠా గుట్టు రట్టు

ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠా కార్యకలపాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఏకకాలంలో ఈ ముఠాకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాదులు నిర్వహించడంతో ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారి వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసిన ముఠా లో 12 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు గా తెలుస్తుంది. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+