వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ సభకు రాజగోపాల్ రెడ్డి... వస్తారా, డుమ్మా కొడతారా...?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాకతో నేతలు, శ్రేణులు బిజీగా ఉన్నారు. కానీ ఒక్క నేత మాత్రం కనిపించడం లేదు. అతనే ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వరంగల్‌లో జరిరే రైతు సంఘర్షణ సభకు సంభంధించి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు పాల్గొనబోతున్నారు. ఈ సభ ద్వారా తాము అంతా ఒక్కటేనని.. అంతా ఐక్యంగానే ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరవుతారా ? లేదా ? అన్నది సస్పెన్స్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం క్యారెక్టర్ లేని వాళ్ల దగ్గర పని చేయలేనంటూ నియోజకవర్గం నేతలతో వ్యాఖ్యలు చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ అందరికీ చెప్పే తీసుకుంటానని అన్నారు. అయితే ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంటి ముట్టనట్టుగానే ఉన్నారు.

 komatireddy rajagopal reddy attend rahul gandi meeting

కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. వాస్తవానికి 2018లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటి నుంచే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వస్తున్నారు. బీజేపీలోకి వెళతారనే ప్రచారం కూడా జరుగుతుంది. బీజేపీలోకి వెళతానని చెప్పకున్నా.. అదే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

తన సోదరుడి నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి కచ్చితంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఎంపీ వెంకట్ రెడ్డి చెప్పడం లేదు. దీంతో ఆయన పార్టీలో కొనసాగుతారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ రాబోయే వరంగల్ సభకు రాజగోపాల్ రెడ్డి వస్తారా ? లేదా ? అనేది తేలనుంది. వస్తే కాంగ్రెస్‌లో కొనసాగుతారు. లేదంటే మరో పార్టీలో చేరతారు అనే అర్థం వస్తోంది.

English summary
komatireddy rajagopal reddy attend rahul gandi meeting or not. if he comes continue party otherwise no chance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X