ఆమెకు ఏపీ వ్యక్తితో పెళ్లి..: కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు

వరంగల్: స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పరోక్షంగానే కాదు.. నేరుగా విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటోంది.

తాజాగా, మరోసారి కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ రాజయ్య విమర్శించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని రాజయ్య తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

MLA Thatikonda Rajaiah hits out at MLC Kadiyam Srihari

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి చేసుకున్న కడియం శ్రీహరి కూతురు ఎస్సీ కాదని.. బీసీ బీ కులానికి చెందుతారని రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 85వేల ఎస్సీల ఓట్లు ఉంటే.. దాంట్లో 63 వేల ఓట్లు మాదిగలవే అని రాజయ్య తెలిపారు. 14 ఏళ్లు మంత్రిగి ఉండి.. ఏనాడూ కూడా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి పట్టించుకోలేదని మండిపడ్డారు.

కడియం మంత్రి కావాలనుకుంటే అతనికి ఎమ్మెల్సీ పదవి సరిపోతుందని రాజయ్య అన్నారు. నియోజకవర్గంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు కడియం శ్రీహరితోపాటు ఆయన అనుచరులు ఏనాడూ హాజరుకారని చెప్పారు. దళితులందరూ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడటం తన బాధ్యత అని అన్నారు రాజయ్య.

నియోజకవర్గంలో గొప్పగా పనిచేస్తున్న తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు రాజయ్య. అన్ని గ్రామాల్లోనూ తిరుగతానని.. ఇంటింటికి పోతానని అన్నారు. నేను డప్పు కొడతాను.. నీవు కొడతావా? అని కడియంకు రాజయ్య సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ తనను తప్పకుండా పిలిపించుకుంటారన్నారు. గోబెల్స్ ప్రచారం చేసేవాళ్ల మాటలు ప్రజలు నమ్మవద్దని రాజయ్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+