మోరంచపల్లిలో బాధితులను చూసి చలించిన కిషన్ రెడ్డి: ఆ 900 కోట్లు విడుదల చేయాలి
వరంగల్: వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లితోపాటు ఇతర గ్రామాల్లోని బాధిత ప్రజలను పరామర్శించిన కిషన్ రెడ్డి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ క్రమంలో ముందుగా పోతననగర్ వరద బాధితులను పరామర్శించి.. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరద ఉధృతికి దెబ్బతిన్న బ్రిడ్జి, రహదారులను పరిశీలించారు. కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర బృందాలు రేపట్నుంచి వరద నష్టం వివరాలు సేకరిస్తాయని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ. 900 కోట్ల విపత్తు నిధులను వాడాలని కిషన్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందజేస్తామని.. ఇందులో కేంద్రం రూ. 3 లక్షలు, రాష్ట్రం రూ. లక్ష ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పర్యటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
📍Moranchapalli village, Warangal, Telangana.
— G Kishan Reddy (@kishanreddybjp) July 30, 2023
Visited various rain-affected areas.
Interacted with residents and took ground updates. Assured the compensation of ₹4 lakh to the families who have missed their family members in the floods. Ordered the officials to expedite the… pic.twitter.com/B1jFM6UGGJ
'ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించాను. వరదల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు సర్వస్వం పోగొట్టుకున్న గ్రామస్తులను చూసి చలించిపోయాను. వరదల్లో గల్లంతైన వారి కుటుంబాలని పరామర్శించి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చాను' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించాను. వరదల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు సర్వస్వం పోగొట్టుకున్న గ్రామస్తులను చూసి చలించిపోయాను. pic.twitter.com/zCgKqWOJry
— G Kishan Reddy (@kishanreddybjp) July 30, 2023
'గల్లంతైన మృతదేహాల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించాను. పలువురు బాధిత కుటుంబాలను ఈ సందర్భంగా పరామర్శించాను. ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను. ఇక్కడ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు.. ఒక ఫోన్ కాల్‌తోనే స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షాకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

కాగా, వర్షాలు, వరద ఉద్ధృతి తగ్గినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద తగ్గినా సహాయ సహకారాలు అందక.. మరికొన్ని చోట్ల బురదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తా చెదారం కొట్టుకొచ్చి.. వీధులన్నీ అపరిశుభ్రంగా మారాయి. ఇళ్లల్లోకి కూడా బురద చేరింది. ఇంట్లోని వస్తువులు, నిత్యావసరలు పనికి రాకుండా పోయాయని బాధిత ప్రజలు వాపోతున్నారు. మరోవైపు, అధికారులు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications