పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆళ్ల నాని అనుమానాలు నిజమే: చంద్రబాబు పర్యటన ఖరారు: ప్రభుత్వ హత్యలుగా

|
Google Oneindia TeluguNews

ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జంగారెడ్డిగూడేనికి వెళ్లనున్నారు. నాటుసారా సేవించి, మృరణించిన వారి మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు పర్యటన విషయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని జోస్యం ఫలించినట్టయింది. రేపో మాపో ఆయన జంగారెడ్డి గూడెంలో పర్యటించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఆళ్ల నాని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ హత్యలుగా..

ప్రభుత్వ హత్యలుగా..

తాడేపల్లిగూడెంలో చీప్ లిక్కర్ సేవించి మరణించిన వారి సంఖ్య పెరిగింది. ఈ నాలుగు రోజుల వ్యవధిలో 18కి చేరింది. ఈ వ్యవహారంపై తెలుగుదేశం- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంది. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు విమర్శించారు. కల్తీ సారా వల్ల అమాయకులు ప్రాణాలు వదులుతున్నారని, ప్రభుత్వం దీన్ని నియంత్రించలేకపోతోందని మండిపడుతున్నారు.

ఆళ్లనానిపై ఫైర్..

ఆళ్లనానిపై ఫైర్..

చీప్ లిక్కర్ మరణాలపై వైసీపీ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, వాస్తవాలను వెలికి తీయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. స్థానికుల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టేలా తక్షణ చర్యలకు దిగాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. చీప్ లిక్కర్ మరణాల విషయంలో ఉప ముఖ్యమంత్రి మంత్రి ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పు పట్టారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

 ప్రభుత్వ వైఖరి వల్లే..

ప్రభుత్వ వైఖరి వల్లే..

జంగారెడ్డిగూడెం ఘటనకు ముఖ్యమంత్రి ధనదాహామే కారణమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. వలంటీర్లు, వైసీపీ నాయకులే నాటుసారా, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వాటిని నిరోధించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని మండిపడ్డారు. మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకోవడంపై చూపుతున్న శ్రధ్ధలో కొంచెమైనా మహిళల భద్రతపై చూపట్లేదని ఆరోపించారు.

ఆళ్లనాని వాదన..

ఆళ్లనాని వాదన..

ఆసుపత్రిలో వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి కుటుంబీకులకు నష్ట పరిహారం వస్తుందని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రలోభపెడుతున్నారని ఆళ్ల నాని విమర్శించారు. ఈ విషాద సంఘటనను చంద్రబాబు, టీడీపీ నాయకులు రాజకీయం చేస్తోన్నారని, శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విషాదకర ఘటనల నుంచి రాజకీయ లబ్ది పొందడం తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ అలవాటేనంటూ మండిపడ్డారు.

టీడీపీ శవరాజకీయాలు..

టీడీపీ శవరాజకీయాలు..


రేపోమాపో చంద్రబాబు జంగారెడ్డిగూడెంలో పర్యటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఆసుపత్రుల రికార్డుల ప్రకారం జంగారెడ్డిగూడెంలో వారం రోజుల్లో అయిదుమంది మరణించారని గుర్తు చేశారు. వారిలో ఒకరు గుండెపోటుతో మరణించగా.. మిగిలిన నలుగురు అతిగా మద్యం తాగడంతో చనిపోయారని ఆళ్ల నాని స్పష్టం చేశారు. వివిధ కారణాలు, అనారోగ్య సమస్యలతో చనిపోతున్న వారి మరణాలపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

 బీజేపీ సైతం..

బీజేపీ సైతం..

జంగారెడ్డి గూడెం చీప్ లిక్కర్ మరణాలపై అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ కూడా ప్రభుత్వంపై ఘాటు విమర్శలను సంధిస్తోంది. వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. వాస్తవాలను దాచి పెడుతోందని, సమస్య పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందంటూ ఆరోపించారు. మద్యం గంజాయి, నాటుసారా విక్రయాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
TDP Chief Chandrababu Naidu will visit Jangareddy Gudem in West Godavari, where 16 die after consuming cheap liquor, on March 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X