పశ్చిమ గోదావరిలో దారుణం.. కత్తిపీటతో భార్యను హత్య చేసిన భర్త..
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మతి స్థిమితి సరిగా లేని ఓ వ్యక్తి తన తన భార్యను కత్తిపీటతో దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతనూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని పాలకోడేరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం మాగల్లు గ్రామానికి చెందిన కొరకూటి సత్యవతి(68), నాగేశ్వరరావు(70) భార్యభర్తలు. ఇద్దరూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని నెలల నుంచి నాగేశ్వరరావు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఇందుకోసం మందులు కూడా వాడుతున్నాడు. భర్త అనారోగ్యంతో కుటుంబ భారం సత్యవతి పైనే పడింది. కూలీ నాలీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇదే క్రమంలో సత్యవతి మంగళవారం(మే 5) కూడా కూలీ పనికి వెళ్లింది. రాత్రి ఇంటికి తిరిగొచ్చాక నాగేశ్వరరావు ఆమెతో గొడవపడ్డాడు.

Recommended Video
ఇదే క్రమంలో కత్తిపీటతో విచక్షణారహితంగా దాడి చేయడంతో సత్యవతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతను కూడా ఇంట్లో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. స్థానికులు,ఇతర కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications