రూ.10 వేల సాయం.. సర్కార్ తీరుపై ఆగ్రహాం, గూడెంలో నాగబాబు పర్యటన

జంగారెడ్డి గూడెం మరణాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలో గల జ‌న‌సేన కూడా స్పందించింది. మ‌ర‌ణాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌స్తావించ‌గా.. ఆ మ‌రునాడే మంగ‌ళ‌వారం పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్, ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు జంగారెడ్డిగూడెంలో ప‌ర్య‌టించారు. నాటు సారా కార‌ణంగా చనిపోయార‌ని భావిస్తున్న బాధితుల కుటుంబాల‌ను నాదెండ్ల‌ మనోహర్, నాగ‌బాబు ప‌రామ‌ర్శించారు. ఆ కుటుంబాల‌కు త‌క్ష‌ణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

అంతకుముందు పవన్ కల్యాణ్ పర్యటించారు. సారా వల్లే జనం చనిపోయారని కామెంట్ చేశారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తప్పిదం వల్లే అమాయక జనం చనిపోతున్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫున ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున సాయం చేశారు.

mega brother naga babu given rs.10 thousand. jangareddy gudem kin family.

జంగారెడ్డి గూడెంలో మరణాలపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని అంతకుముందు అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ప్రాణాలు పోతున్నా స్పందించరా? అని చంద్రబాబు నిలదీశారు. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

చౌక మ‌ద్యం అధిక ధ‌ర‌ల‌కి విక్రయిస్తున్నారని, ఆ మ‌ద్యం కొన‌లేక సారా తాగి ఇంత మంది బలయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఎక్సైజ్‌, ఎస్ఈబీ, జ‌గ‌న్ అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వం, సంబ‌ధిత శాఖ స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోందన్నారు. జంగారెడ్డిగూడెం సారా మ‌ర‌ణాల‌పై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇవాళ జనసేన స్పందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+