భోరుమన్న నరసాపురం ఎంపీ
Bhupathiraju Srinivasa Varma: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు భూపతిరాజు శ్రీనివాసరాజు నక్క తోక తొక్కారు. తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన ఆయనకు నరేంద్ర మోదీ కేబినెట్‌లో బెర్త్ లభించింది. తెలుగుదేశం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించినట్టయింది.
మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజవర్గం నుంచి తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు భూపతిరాజు. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే తిరుగులేని మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు. సుమారు 3.50 లక్షల ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూడూరి ఉమాబాలపై విజయం సాధించారు.

ఇప్పుడాయనకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చివరి నిమిషంలో భూపతిరాజు బెర్త్ ఖరారయింది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి రెండు బెర్త్‌లను కేటాయించింది బీజేపీ. కింజరాపు రామ్మోహన్ నాయుడు- శ్రీకాకుళం, పెమ్మసాని చంద్రశేఖర్- గుంటూరు పేర్లు తొలుత వెలుగులోకి వచ్చాయి.
ఆ తరువాత కొద్దిసేపటికే భూపతిరాజు శ్రీనివాసవర్మ పేరు తెర మీదికి వచ్చింది. ఏపీ నుంచి బీజేపీకి కేంద్ర కేబినెట్‌లో బెర్త్ కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పేరును ఎంపిక చేసింది పార్టీ అధిష్ఠానం. ఈ మేరకు ఢిల్లీకి రావాల్సిందిగా నరసాపురంలో ఉన్న శ్రీనివాసవర్మకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ అందింది.
ఈ ఫోన్ కాల్ అందిన వెంటనే ఆయన బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును కలిశారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పట్టుకుని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఓ సామాన్య కార్యకర్తగా ఉన్న తనను పార్టీ.. కేంద్రమంత్రిని చేసిందంటూ చెప్పారు.












Click it and Unblock the Notifications