• search
  • Live TV
పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అర్ధరాత్రి డైరీ యజమాని దారుణ హత్య: వివాహేతర సంబంధమే కారణమా?

|

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మోడల్ డైరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ ప్రభు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి 1.45గంట సమయంలో అతడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. 108 సాయంతో వెంటనే స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ ప్రభు మృతి చెందారు. కాగా, హత్య ఉదంతం స్థానికంగా ఉన్న సీసీకెమెరాల్లో రికార్డు అయింది.

కాగా, సురేష్ ప్రభు హత్యకు కారణం అతను పెట్టుకున్న వివాహేతర సంబంధమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ అక్రమ పెట్టుకున్న మహిళ ఇంటి సమీపంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి అక్రమ సంబంధమే కారణం గా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలావుంటే, తాను ప్రేమిస్తున్న యువతిని సురేష్ ప్రభు తన బైక్‌పై ఎక్కించుకున్నాడనే కోపంతోనే నిందితుడు ఈ హత్య చేశారని ప్రచారం జరుగుతోంది.

లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి

లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. విజయనగరం జిల్లా పాలకొండ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు చనిపోగా, బైక్ నడుపుతున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

 కాలువలో పడ్డ కారు.. ఒకరు మృతి

కాలువలో పడ్డ కారు.. ఒకరు మృతి


కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కృష్ణా కరకట్టపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఐదుగురిరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి మోపిదేవి మండలం చిరువలో గ్రామానికి వెళుతున్న కారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్తంభాన్ని ఢీకొని కరకట్ట పక్కనే ఉన్న కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో కైలా ప్రశాంత్(25) అక్కడికక్కడే మరణించాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. మరో నలుగురు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

 అమానుషం: చెత్తకుప్పలో శిశువు

అమానుషం: చెత్తకుప్పలో శిశువు

ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వారం రోజుల పసికందును రిమ్స్ ఆవరణలోని ఎఆర్‌టి సెంటర్ దగ్గర రోడ్డు పక్క చెల్లచెట్లలో పడేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన వైద్యాధికారులు.. చెత్త కుప్పలో పడివున్న శిశువును ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అప్పటికే చనిపోయిందని గుర్తించారు. మృతదేహం వారం రోజుల మగ శిశువుదిగా నిర్ధారించారు.

శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. శిశువు చనిపోయిన తరువాత పడేశారా? లేక పడేసి వెళ్లిపోతే శిశువు చనిపోయిందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. అలాగే శిశువును పారేసి వెళ్లిపోయిన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని, సమీపంలోని సీపీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

English summary
west godavari: Milk dairy owner murdered in Jangareddygudem, incident caught on cc camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X