వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mahesh Babu:కమర్షియల్ యాడ్స్‌కు ప్రిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన సెలబ్రిటీస్‌కు బాగా వంటపట్టినట్లుంది. అందుకే ఓ వైపు రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ మరో రెండు చేతులతో సంపాదిస్తుంటారు. ఇక జనాల్లో వారికున్న క్రేజ్‌ను బట్టి వారికి పారితోషికం కింద క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే పలువురు సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. వీరిలో మహేష్ బాబు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న మహేష్ బాబు ఇటు సినిమాలు చేస్తూ అటు యాడ్స్‌ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇంతకీ ఈ సూపర్‌స్టార్ ఒక యాడ్‌కు ఎంత పారితోషికం పుచ్చుకుంటున్నారో తెలుసా..?

 కమర్షియల్ యాడ్స్‌లో మహేష్ టాప్

కమర్షియల్ యాడ్స్‌లో మహేష్ టాప్

సినిమా హీరోలు హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్‌తో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడం ఆ తర్వాత ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ముందుగా యాడ్స్ వైపే దృష్టి సారించారు మన హీరోలు. ఇక వాణిజ్య ప్రకటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు ఖాతాలో చాలా కమర్షియల్ యాడ్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ప్రిన్స్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేష్ బాబు ఈ మధ్యే ప్రముఖ ఈ -కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్‌ కోసం ఓ యాడ్‌ చేశారు. దీనికి భారీగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఎప్పటి నుంచో సంతూర్, థమ్స్‌అప్, బైజూస్ లాంటి కమర్షియల్ యాడ్స్‌లో నటించిన మహేష్ బాబు... ఏడాదికి తీసుకునే రెమ్యూనరేషన్ ఐదు కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఫిలింనగర్ టాక్.

 ఒక్క సినిమాకు స్టార్లు తీసుకునే రెమ్యునరేషన్

ఒక్క సినిమాకు స్టార్లు తీసుకునే రెమ్యునరేషన్

ఇంత భారీ మొత్తంలో యాడ్స్‌కు పారితోషికం తీసుకుంటున్న వారిలో ప్రిన్స్ మహేష్ బాబు ముందువరసలో ఉన్నాడు. ఇక సినిమా విషయానికొస్తే మహేష్ బాబు ఒక సినిమాకు రూ. 22 కోట్లు నుంచి 25 కోట్లు తీసుకుంటారని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇటు పొలిటికల్ లైఫ్‌ను అటు సినిమా జీవితాన్ని రెండిటిని జనసేనాని బ్యాలెన్స్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ రూ.22 కోట్లుగా తెలుస్తోంది. సినిమాల నుంచి వీరు తీసుకునే పారితోషికం ఓ మోస్తారుగా ఉంటే... సామాజిక సేవలకు కూడా వీరు భారీ విరాళాలను ఇవ్వడాన్ని కూడా అభినందించాల్సిందే.

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు ఇస్తున్న స్టార్లు

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు ఇస్తున్న స్టార్లు

కొద్ది రోజుల క్రితం హైదరాబాదును వరద ముంచెత్తడంతో టాలీవుడ్ కదిలొచ్చింది. స్టార్స్ అంతా తమకు తోచినంతలో సీఎం సహాయనిధికి విరాళాలు అందజేశారు. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్‌, నాగార్జునలాంటి స్టార్లు భారీ విరాళాలను సీఎం సహాయనిధికి ప్రకటించారు. ఇలా మన తెలుగు స్టార్స్ ఓ వైపు సినిమాలతో బాగా సంపాదిస్తూనే మరో వైపు అవసరమైన సమయాల్లో ఆదుకోవాల్సి వచ్చినప్పుడు భారీ విరాళాలను ప్రకటిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

English summary
Tollywood Hero Prince Mahesh Babu is charging high amount for the commercial ads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X