బోస్టన్ లో తెలంగాణ నైట్
బోస్టన్ లోని తెలంగాణ నైట్ ఈ ప్రాంత జానపద గేయాలు, సంగీతం, నృత్యాలతో దద్ధరిల్లింది. తెలంగాణ ఎన్నారైల సంఘం వార్షికోత్సవాల సందర్భంగా బోస్టన్ తెలంగాణ నైట్ ను ఈ నెల 12వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పాల్గన్నారు. తెలంగాణేతర ఎన్నారైలు కూడా ఈ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. న్యూ ఇంగ్లాండు నుంచే కాకుండా న్యూజెర్సీ, న్యూయార్క్, ఫిలడేల్ఫియాల నుంచి ప్రజలు ఈ ఉత్సవాలకు వచ్చారు.
వెంకట్ మారోజు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం ప్రియాంక గణేశ స్తోత్రం, జయ జయ హే తెలంగాణ గేయం ఆలపించింది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రాత్రంతా పిల్లలు, పెద్దలు జానపద గేయాలు ఆలపించారు. నృత్యాలు చేశారు. తుహిన, తుషిరా అక్కాచెల్లెళ్లు చేసిన జానపద నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఆలోక్ మాచెర్ల పాపులర్ గేయానికి చేసిన నాట్యం కూడా అందరినీ ఆకర్షించింది. తెలంగాణపై ఏర్పాటు చేసిన క్విజ్ లో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై ముఖ్యంగా ప్రశ్నలు వేశారు. పిల్లలకు తెలంగాణ చరిత్ర, సంస్కృతులపై విశేష పరిజ్ఞానం ఉన్న విషయాన్ని ఈ కార్యక్రమం వెల్లడించింది.
సంఘం చైర్మన్ రవి మేరెడ్డి తెలంగాణ రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో ఎన్నారైలు పాలు పంచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అమెరికాలో, తెలంగాణలో సంఘం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు. తెలంగాణలో తమ సొంత గ్రామాల అభివృద్ధికి ఎన్నారైలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తెలంగాణ వంటకాలతో భోజనాలు చేశారు. ఉగాది పచ్చడి అందరికీ ఆనందాన్ని పంచింది. సంఘం కోశాధికారి అమర్ కర్మిల్లా కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకట్ మారోజు, విజయ మారోజు, గీతాంజలి కర్మిల్లా, రాజేందర్ కాలువల, రోహిణి కాలువల, రాయదాస్ మంతెన, స్వర్ణ మంతెన, శాంతి పుట్టా, నవీన్ పుట్టా, శ్రీనివాస రావు మేనేని, మంజుల మేనేని, వెంకట్ రెడ్డి, సరిత, సునీల్ పీచర, రమేష్ దడిగల, పార్వతి దడిగల, శ్రీధర్ తక్కల్లపల్లి, సాయి స్వరూప్ తోట, వర్ష బియ్యాల, వంశీ కోడూరి కూడా ఈ కార్యక్రమ నిర్వహణకు కృతజ్ఞతలు తెలిపారు. రవి మేరెడ్డితో పాటు సౌందర్య మేరెడ్డి, రవి ధన్నపునేని, సంగీత ధన్నపునేని, వెంకటయోగి నారాయణ స్వామి, వెంకటయోగి విద్య, తెలంగాణ జయప్రకాశ్, చైతన్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications