పదో తరగతి విద్యార్థుల కోసం ఎన్నారైలు
నల్లగొండ డాట్ ఆర్గ్ నల్లగొండ జిల్లాలోని 17 పాఠశాలల్లో ఎస్.ఎస్.సి. శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నల్లగొండ డాట్ ఆర్గ్ నిర్వాహకులు పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందించింది. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి వాలంటీర్లను నియమించింది.
పాఠశాల సమయం ముగిసిన తర్వాత వాలంటీర్లు పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పాఠశాల ముగిసిన తర్వాత రెండు గంటల పాటు విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం చేసే ఈ కార్యక్రమం సాగుతోంది. ఈ సందర్భంగా విద్యార్థులకు స్నాక్స్ కూడా ఇవ్వడం పెట్టుకున్నారు. ఒక్కో పాఠశాలకు ఇందుకు గాను అమెరికాలోని నల్లగొండ జిల్లాకు చెందిన నల్లగొండ డాట్ ఆర్గ్ నిర్వాహకులు పది వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం 17 పాఠశాలలకు కోటీ 70 లక్షల రూపాయలు ఖర్చవుతోంది.
ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందని నల్లగొండ డాట్ ఆర్గ్ ప్రతినిధి శ్రీధర్ దొంతి చెప్పారు. జిల్లా కలెక్టర్, అధికారులు, జిల్లా విద్యాధికారి, డిప్యూటీ జిల్లా విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తమకు సహకరిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications