తెలంగాణ ఎన్నారైల దీక్షలు

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, హైదరాబాదుల్లో ఈ నిరాహార దీక్షలు జరిగాయి. ఈ నిరాహార దీక్షల్లో పెద్దలు, పిల్లలు, అన్ని వయస్సుల్లోనివారు పాల్గొన్నారు. న్యూజెర్సీలో మధు రెడ్డి, జమున, రవి పుష్కర్, రవి దన్నపనేని, రమేష్ చిల్లా, మురళీ చింతలపాణి, ఇంద్రసేన్ పూడి, ప్రతాప రెడ్డి, సుధాకర్ పైళ్ల, జ్ఞానేశ్వర్, రాజ్ సలీం, సతీష్ తోట, శ్రీనివాస్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కాలిఫోర్నియాలో జగన్ బీరెల్లి, శైలజా బీరెల్లి, శ్రీధర్ కుందూరు రేణుక, తారలిక కుందూరు రేణుక, బొక్కం పి. పాల్ దీక్షలో పాల్గొన్నారు. ఫిలడేల్ఫియాలో తెలంగాణ ఎన్నారైల సంఘం ప్రతినిధులు నిరాహార దీక్ష చేశారు. కొలంబస్ సో మహేష్ తన్నార్, వాషింగ్టన్ డిసిలో రాజేశ్ మాదిరెడ్డి, రాజేష్ బాదం పాల్గొన్నారు. అట్లాంటాలోబ జిఎస్ రెడ్డి, మాధవ్ పంతుల, బోస్టన్లో శాంతి పుట్టా, లాస్ ఏంజిల్స్ లో రామ్ దీక్షలో పాల్గొన్నారు.
కెనడాలో శోబా రావు పీచర, వనజ పెద్ది, మాస్టర్ పెద్ది శ్రేయాస్, శివకుమార్ గుర్రప్పాడి, జలంధర్ ఆలేటి, శ్రీనివాస రావు శరాఫ్, విద్యాసాగర్ బొద్దుల, కరుణాకర్ రావు పీచర, మహేష్ మదాడి, సురేందర్ పెద్ది నిరాహార దీక్ష చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జువ్వాడి శ్రీనివాస్, దేవారెడ్డి, మస్క్ రాము, వై. శ్రీనివాస్, ఆడెపు కిషన్, తిరుపతి రెడ్డి, సలావుద్దీన్ మొహమ్మద్ నిరాహార దీక్ష చేపట్టారు. అబుదాబిలో వంద మంది తెలంగాణవారు నిరాహార దీక్ష చేశారు. దుబాయ్ లో 150 మందికి పైగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో వినోద్ ఏలేటి, ఇజ్రాయిల్ లో విమల కటికనేని నిరాహాద దీక్ష చేశారు.












Click it and Unblock the Notifications