బ్రిటన్ వీసాలకు వారం రోజులు సెలవు

అన్ని బ్రిటిష్ హైకమిషన్లు, రాయబార కార్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం చేయడంలో భాగంగా దక్షిణ భారత దేశంలోని వీసా దరఖాస్తు కేంద్రాలను మూసివేస్తున్నట్లు చెన్నైలోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ తన ప్రకటనలో వివరించింది. ఈ కేంద్రాలు మళ్ళీ ఏప్రిల్ 6వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తాయి.
ఏప్రిల్ నెలలో యునైటెడ్ కింగ్ డమ్ సందర్శించాలనుకునే వారు తమ తమ వీసా దరఖాస్తులను హైదరాబాద్, కోచి, బెంగళూరు కేంద్రాల్లో మార్చి 30వ తేదీలోగా, చెన్నై కేంద్రంలో 31 లోగా సమర్పించుకోవాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications