వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై వోటింగ్ రైట్స్ బిల్లుపై చర్చ

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
భారత ప్రభుత్వం ప్రవాస భారతీయులకు (ఎన్నారైలకు) ఓటింగ్ హక్కు ఇచ్చే బిల్లుపై ఎన్నారైలు చర్చకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుత రూపంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన ఎన్నారై వోటింగ్ హక్కు బిల్లును వ్యతిరేకించాలని ఎన్నారైలు నిర్ణయించుకున్నారు. అందుకు గాను ఈ నెల 31వ తేదీన అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ (ఐసిసి)లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ను, సాంస్కృతిక సంఘాలను, మీడియాను ఆహ్వానిస్తున్నారు. ఎన్నారై ఆబ్సెంటీ వోటింగ్ రైట్స్ ను వారు కోరుతున్నారు. అంటే, తమ తమ నియోజకవర్గాల్లో లేకున్నా ఓటు వేయడానికి ఎన్నారైలకు హక్కు కల్పించాల్సి ఉంటుంది. వోటింగ్ జరిగే సమయంలో ఎన్నారైలు తమ తమ నియోజకవర్గాల్లో ఉండాలని, వ్యక్తిగతంగా హాజరై వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రస్తుత బిల్లులో నిబంధన విధించారు. ఆర్వీ రావు, ప్రసన్న సమావేశ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు.

ఎన్నారై వోటింగ్ హక్కు బిల్లును ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభ ఆమోదించింది. శీతాకాలం సమావేశాల్లో ఈ బిల్లు లోకసభ రానుంది. దాదాపు 25 మిలియన్ల భారతీయులు విదేశాల్లో ఉన్నారు. వారంతా వ్యక్తిగతం పోలింగ్ రోజు భారతదేశంలోని తమ తమ నియోజకవర్గాల్లో ఉండడం సాధ్యం కాదని ఎన్నారైలు వాదిస్తున్నారు. అమెరికానే తీసుకుంటే, మొత్తం పది లక్షల మంది ఎన్నారై ఓటర్లుంటారని అంటున్నారు. విద్యార్థులు 2 లక్షల మంది, అమెరికాలో హెచ్1 - బి హోల్డర్లు 3 నుంచి 5 లక్షల మంది, గ్రీన్ కార్డు హోల్డర్లు ఐదు లక్షల మంది ఉంటారని ఓ అంచనా. వీరందరూ పోలింగ్ రోజు భారత్ రావాలంటే వంద రోజులు పడుతుందని అంటున్నారు. అది ఆచరణ సాధ్యం కాని విషయమని వాదిస్తున్నారు. పది లక్షల మంది ఒకేసారి రావాలంటే సాధ్యపడదు కాబట్టి 99 రోజుల ముందు నుంచి వరుస బెట్టి రావాల్సి ఉంటుందని, దీని వల్ల ఎన్నారైల డబ్బు, సమయం వృధా అవుతుందని అంటున్నారు. అందువల్ల ప్రస్తుత బిల్లుకు సవరణ కావాలనేది ఎన్నారైల డిమాండ్. ఈ నెల 31వ తేదీన చర్చలో పాల్గొనదలచినవారు [email protected], http://www.nrivotingrights.info సంప్రదించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X