కుంపటి రాజేసి.. చైనా గడప తొక్కిన పాకిస్తాన్ ప్రధాని
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నాలుగు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో సమావేశం కానున్నారు. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా షెహబాజ్ షరీఫ్.. చైనాలో పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటన తలపెట్టడం చర్చనీయాంశమౌతోంది.
ఈ పర్యటనలో ప్రధాని షరీఫ్ వెంట ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్, సమాచార మంత్రి అతావుల్లా తరార్, ఐటీ మంత్రి షాజా ఫాతిమా, ప్రధానమంత్రి సలహాదారు తారిఖ్ ఫతేమి ఉన్నారు. ఈ నెల 26వ తేదీ వరకు వివిధ సమ్మిట్లకు హాజరవుతారు. రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖతో ముఖాముఖి భేటీ అవుతారు. గ్ఝి జిన్ పింగ్ తో సమావేశం కానున్నారు. గ్వాదర్ ఫైనాన్షియల్ కారిడార్ సహా వివిధ అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి.

ప్రీమియర్ లీ కియాంగ్‌తో సహా పలువురు ఉన్నత స్థాయి నాయకులతో భేటీ అవుతారు. రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని రెండు పక్షాలు సమీక్షిస్తాయి. పాకిస్తాన్-చైనా ఆల్ వెదర్ స్ట్రాటజిక్ కోఆపరేటివ్ పార్టనర్‌షిప్ కోసం పని చేస్తోన్నాయని పీఎంఓ తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, వ్యవసాయ ఆధునీకరణ తదితర అంశాలపై ఇరు దేశాలు చర్చిస్తాయని వివరించింది.
🔊PR No.1️⃣2️⃣5️⃣/2️⃣0️⃣2️⃣6️⃣
— Ministry of Foreign Affairs - Pakistan (@ForeignOfficePk) May 22, 2026
Curtain Raiser: Prime Minister Muhammad Shehbaz Sharif to Undertake Official Visit to China https://t.co/XBGEvIy7MS
🔗⬇️ pic.twitter.com/Pd2xrzCCVd
సమాచార సాంకేతికత, సైన్స్ అండ్ టెక్నాలజీ మార్పిడి వంటి అంశాలపై కూడా షెహబాజ్ షరీఫ్ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదట షరీఫ్.. హాంగ్‌ఝౌలో ల్యాండ్ అవుతారు. పాకిస్తాన్-చైనా బీ2బీ పెట్టుబడి సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. అనంతరం బీజింగ్‌కు బయలుదేరి వెళ్తారు. దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా చైనీస్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్‌షిప్ విత్ ఫారిన్ కంట్రీస్ నిర్వహించే రిసెప్షన్‌లో ప్రధాని పాల్గొంటారు.
لاہور: 23 مئی 2026.
— Prime Minister's Office (@PakPMO) May 23, 2026
وزیرِ اعظم محمد شہباز شریف اپنے چار روزہ دورہء چین کے پہلے مرحلے میں ہانگژو روانہ.
نائب وزیرِ اعظم و وزیرِ خارجہ سینیٹر محمد اسحاق ڈار، وزیرِ منصوبہ بندی احسن اقبال، وزیرِ اطلاعات و نشریات عطاء اللہ تارڑ، وزیر آئی ٹی شزہ فاطمہ خواجہ اور معاون خصوصی طارق… pic.twitter.com/owAuHidew0
పశ్చిమాసియాలో ఉద్రిక్తలను తగ్గించడానికి ఉద్దేశించిన శాంతి చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్ లో ఈ చర్చలు సాగాయి గానీ అవి పెద్దగా ఫలితాలనివ్వలేదు. రెండో దఫా చర్చలు ప్రతిపాదించినా అమెరికా ఇందులో పాల్గొనలేదు. ఇరాన్ సమర్పించిన ఫార్ములాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చడమే దీనికి ప్రధాన కారణం అనేది తెలిసిన విషయమే. ఈ అంశం కూడా షరీఫ్ చైనా పర్యటన సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications