వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా తెలంగాణ కల్చరల్ నైట్

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
డెట్రాయిట్: స్థానిక సెయింట్ తోమా చర్చిలో డెట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ ఏర్పాటు చేసిన తెలంగాణా కల్చరల్ నైట్ ఘనంగా జరిగింది. డెట్రాయిట్ మెట్రో ప్రాంతం నుంచి ఎముకలు కొరికే చలిలో కూడా దాదాపుగా 800 వందల మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ కల్చరల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక వ్యాపారవేత్త భరత్ రెడ్డి మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర శాసనసభ చరిత్రలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక ఎన్నారై, యువ నాయకుడు, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం శాసనసబ్యుడు అనిల్ ఇరవత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సంధ్యక్క (మా భూమి) ఆలపించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ వాదులలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తాజాగా కలిగించే లక్ష్యంతో ఈ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. సంధ్యక్క పాటలు పాడుతుంటే ఆహూతులు ఆనందం ఉరకలెత్తి నృత్యాలు చేశారు. పెద్దలతో పాటలు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక చిన్నారులు చేసిన తెలంగాణా జానపద గీతాలు, నృత్యాలు అతిథులను విశేషంగా అలరించాయి.

ముఖ్యఅతిది అనిల్ ఇరవత్రిని సభకు భరత్ రెడ్డి పరిచయం చేశారు. ఈ కల్చరల్ నైట్ కు హాజరైన అందరినీ చూస్తూ ఉంటే మనం అమెరికాలో ఉన్నామా లేక తెలంగాణా గడ్డపై ఉన్నామా అన్పిస్తుందని భరత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అనిల్ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X