రజనీ-రెహమాన్ చిత్రం కోసం ఎదురుచూపులు

రెహ్మాన్ స్వదేశంలో రెండు తెలుగు చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య ('జోష్' ఫేమ్) కథానాయకుడుగా సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న 'ఏ మాయ చేసావో' చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే సోనీ మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ అయింది. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న మరో చిత్రం 'కొమురం పులి'. పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెహ్మాన్ భారతీయ యువతకు గర్వకారణమనీ, సుసంపన్నమైన సంగీత వారసత్వానికి ఆయన ప్రతీక అనీ నెవెడాలో సోమవారంనాడు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇండో-అమెరికన్ స్టేట్స్ మన్ రాజన్ జెడ్ ప్రశంసించారు. ఇండో అమెరికన్ లీడర్ షిప్ కాన్ఫెడరేషన్ చైర్ పర్సన్ గా జెడ్ ఉన్నారు. రెహ్మాన్ తన సంగీతంతో తూర్పు-పశ్చిమ దేశాల సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికారని ఆయన కొనియాడారు.