న్యూజెర్సీ జీయర్ ఆశ్రమంలో శ్రీ యాగానికి మంచి స్పందన

శ్రీయాగంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి న్యూజెర్సీకి వచ్చినప్పుడు ఆయనకు అఖండ స్వాగతం లభించింది. సాంప్రదాయబద్దంగా జీయర్ స్వామివారిని ఆశ్రమానికి భక్తులు తీసుకుని వచ్చారు. జీయర్‌తోపాటు ఈ యాగం కార్యక్రమంలో పాల్గొనేందుకోసం భారతదేశంలోని నలుమూలల నుంచి పండితులు, జియర్ వేదపాఠశాల నుంచి కొంతమంది, యుఎస్‌లోని దేవాలయాల్లో ఉన్న పండితులు మరి కొంతమంది ఇక్కడకు తరలివచ్చారు.
యాగం నిర్వహణకోసం విశాలమైన పందిరిని, భక్తుల సౌకర్యంకోసం కార్పెట్లను, అన్నప్రసాదాల తయారికోసం పెద్ద వంటశాలను ఏర్పాటు చేశారు. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ పర్యవేక్షణలో జరిగిన శ్రీయాగంను పురస్కరించుకుని వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, శ్రీరామాయణం, శ్రీ మహాభారతం, శ్రీమద్భగవద్గీత పురాణాలు, శ్రీ భాష్యం, దివ్య ప్రబంధ పారాయణం చేశారు. 108 మంది వేదపండితులలో శాస్త్రోక్తంగా యాగం చేశారు.
శ్రీయాగంలో భాగంగా రోజుకొక ఇష్టి చొప్పున కార్యక్రమాలు నిర్వహించారు. చినజీయర్ స్వామిజీ ప్రత్యక్షంగా ఇష్టి కార్యక్రమాలను పర్యవేక్షించారు. దీంతో పాటు ప్రతిరోజు సామూహికంగా పూజ కార్యక్రమాలను నిర్వహించారు, శ్రీకృష్ణ, శ్రీ శ్రీనివాస, శ్రీ హయగ్రీవ, శ్రీ లక్ష్మీసృసింహ, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్ స్వామీ,శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications