జెద్ధా: గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న అసంఖ్యాక తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రవాసీ కార్మికులు స్వదేశంలో జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ పోరాటం పట్ల పూర్తి సంఘీభావంగా ఉన్నారని దుబాయిలోని యు.ఏ.ఇ. తెలంగాణ కళాకారుల సమాఖ్యా పేర్కొంది. వారాంతపు సెలవు దినమైన శుక్రవారం సాయంత్రం దుబాయిలోని ఒక పార్కులో తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాఖ్య కళాకారులు వెంగళ నాగరాజు, తోట కిషన్, పోడేటి రమేష్, గాజుల గంగాధర్, తుమ్మల రాజు, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దొనకంటి కమాలకర్, భోగ రణవీర్, నాయిల రమేష్‌లు నాలుగు గంటల పాటు తెలంగాణ పాటలు పాడా రు. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి