లండన్ లోని బ్రిటిష్ కౌన్సిల్ 'యంగ్ క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ (భారత్)-2010' అవార్డును నగరానికి చెందిన తమ్మారెడ్డి యుగంధర్ కైవసం చేసుకున్నారు. బ్రిటన్‌కు చెందిన లెర్నింగ్ అండ్ స్కిల్స్ సీఈవో జాన్‌స్టోన్ చేతులమీదుగా అవార్డును తాజాగా ఢిల్లీలో అందుకున్నారు. యుగంధర్ హైదరాబాద్ లో 'పిక్సెల్లాయిడ్ విజువల్ ఎఫెక్ట్స్' సంస్థను నడుపుతున్నారు. ఫ్యాషన్, ఇంట్రాక్టివ్, స్క్రీన్ తదితర ఏడు విభాగాల్లో బ్రిటిష్ కౌన్సిల్ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. యుగంధర్‌కు స్క్రీన్ విభాగంలో అవార్డు దక్కింది.