వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జెపిపై దాడికి అమెరికాలో నిరసన

టిఆర్ఎస్ పార్టీవారి, ఇతరుల చర్యను వక్తలు ఖండించారు. దాడిని అమానుషమని వారు అభివర్ణించారు. దాడి రాజ్యాంగం పట్ల పట్టింపు లేకపోవడాన్ని, పౌర భావన కరువు కావడాన్ని చూపించిందని వారన్నారు. శాసనసభ ఆవరణలో ప్రజాప్రతినిధులే మాట్లాడలేని స్థితి ఉంటే నగరాల్లో ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పరిస్థితి చూస్తుంటే నియంత పాలనలోని ఈజిప్టు కన్నా ప్రజాస్వామ్య భారతదేశం దారుణంగా ఉందని అనిపిస్తోందని అన్నారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించడానికి వినతిపత్రంపై సంతకాలు చేశారు.