వాషింగ్టన్ డిసిలో ఉగాది వేడుకలు
కాపిటోల్ ఏరియా తెలుగు సొసైటీ (క్యాట్స్) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డిసిలో ఉగాది సంబరాలు జరిగాయి. ఏప్రిల్ 23వ తేదీన ఈ వేడుకలు జరిగాయి. పంచాంగ శ్రవణం తో మొదలైన ఈ ఉత్సవం లోతెలుగింటి చిన్నారులు, యువతులు, యువకులు తమ తమ నాట్యవిలాసాలతో,జానపదాలతో,ఆట పాటలతో డిసి మెట్రో ప్రాంత వాసులను అలరించారు.
మేరీల్యాండ్ స్టేట్ అసెంబ్లీకి హౌస్ ఆఫ్ డెలిగేట్‌గా గా ఎన్నికైన మొట్ట మొదటి తెలుగు మహిళ అరుణ మిల్లర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు ప్రజలందరికి ఆంధ్ర ప్రదేశ్‌ను సిస్టర్ స్టేట్ ఆఫ్ మేరీల్యాండ్‌గా గుర్తించమని మేరిలాండ్ గవర్నర్‌కు ఇ- మెయిల్ ద్వారా విన్నవించాలని కోరడమైనది.

చిన్నారుల నుంచి కురు వృద్దుల వరకు క్రిక్కిరిసిన సభా ప్రాంగణమంతా రఘు కుంచె చమత్కారం,అనూజ్ గురువార జన సమ్మోహనం,నిఖిల్ చలాకితనం,భార్గవి నయగారం,సాంస్కృతిక కార్యక్రమ రూపకర్తల కొత్తదనం,యువ హృదయాల అత్యుత్సాహంతో దద్దరిల్లింది . గాయకుల పరిచయంలో భాగంగా ,పాట పంచదారా,ఆట మగధీర,పాడింది గురువారా అనంగనే ఒక్కసారిగా ఈలలతో చప్పట్లతో మొదలైన అనూజ్ గురువార,భార్గవిల ప్రభంజనం ఆద్యంతం రక్తి కట్టించింది.యువతను తన డ్యాన్సులతో, అభినయం తో నిఖిల్ కుర్ర కారు మనసులను దోచాడు.
సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రఘు కుంచె ఎందుకే రవణమ్మా అంటూ ఆకాశమే సరిహద్దుగా చెలరేగారు.పాట పాటకు మధ్య ప్రజల నుండి వచ్చే ప్రశంసలతో జనాలకు నచ్చే పాటలతో మెచ్చే మాటలతో అందరిని సమ్మోహన పరిచారు.












Click it and Unblock the Notifications