డెట్రాయిట్‌లో జగన్ పార్టీ కార్యాలయం

NRI
ఎన్నారై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, డిట్రాయిట్ చాప్టర్ కార్యాలయాన్ని డిట్రాయిట్ నగరంలో ఈ నెల 17వ తేదీ ఆదివారం ప్రారంభించి పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ సభ్యులు మన పార్టీ ప్రజల ఆకాంక్షల కోసం, వారి అవసరాలు తీర్చడం కోసం ప్రజల నించే ఆవిర్భవించిందని, డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పూర్తితో ముందుకు సాగుతుందని ఉద్ఘాటించారు.

వైయస్సార్ అందించినట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్లిన సువర్ణ పరిపాలనని ఈ సంధర్భంగా గుర్తు చేసుకున్నారు. జగన్ వారి తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల్ని, కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లగల సమర్థవంతమైన నాయకుడిగా తాము బలంగా విశ్వసిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ఆకాంక్షించారు.

కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని వైయస్ జగన్‌కు, విజయమ్మకు అఖండ విజయాన్ని అందించాలని, తద్వారా ఢిల్లీ పీఠాన్ని కదిలించాలని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన ఇటలీ దేశస్తురాలు సోనియా గాంధీకి జ్ఞానోదయం అయ్యేలా తీర్పు ఇవ్వాలని కోరారు. వైయస్ వివేకానంద రెడ్డి అమెరికా వచ్చినప్పుడు ప్రజలందరూ జగన్ తోటే వున్నారు, వైయస్సార్‌కు అసలైన వారసుడు జగన్ మాత్రమే అని పలికిన ఆయన ఎందుకు ఇలా మనసు మార్చుకున్నారో తమకు అంతుపట్టటం లేదని అన్నారు. కడప ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేయడానికి, కడపకు చెందిన ప్రవాసాంధ్రులు వారి వోటును సద్వినియోగం చేసుకోవడానికి అమెరికా నించీ పలువురు కడపకు తరలి వెళ్తున్నారని తెలిపారు.

లింగాల హరిప్రసాద్ రెడ్డి, గునసాని ప్రవీణ్, యడం బాలాజీ , యార్లగడ్డ శివరాం, టి. శ్రీధర్ రెడ్డి, భూమిరెడ్డి యుగంధర్, కుకునూర్ వినోద్, కోనేరు రాహుల్, చిత్తలూరి శ్రీనివాస్, కొనుగంటి రమణ రెడ్డి, శ్రీనివాస్ రాజు, బర్ల శ్రీనివాస్, గాలి నాగేందర్, ఆత్మకూరు వినోద్, పెదపర్తి శ్రీనివాస్, సాంబి రెడ్డి, సాగర్ రెడ్డి, శ్రీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఎన్నారై డెట్రాయిట్ కాంగ్రెస్ పార్టీ డిట్రాయిట్ చాప్టర్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+