అమెరికాలో ఎన్నారైల పట్ల వివక్ష, అవమానం

వివరాలలోకి వెళితే, 2008లో, కవల్జీత్ కౌర్ అతని సోదరుడు రమణ్ దీప్ సింగ్ లు హౌస్టన్ లోని తమ ఇంటికి తిరిగి వచ్చి చూసుకునేటప్పటికి బాత్ రూమ్ లోని ఒక విండో గ్లాస్ పగిలి వుండటం, మాస్టర్ బెడ్ రూమ్ లో వున్న వస్తువులన్నీ చెల్లచెదరై వుండటం, విలువైన ఆభరణాలు, నగలు, కొంత నగదు పోవటం గమనించి ఆ మేరకు జిల్లా అధికార్లకు తమ ఫిర్యాదును అందజేశారు. విచారణకు వచ్చిన డిప్యూటీలు జరిగిన సంఘటనపై దర్యాప్తు కంటే ఫిర్యాదు చేసిన సింగ్, అతని సోదరుడు కౌర్ ల పైన దౌర్జన్యం చేయడం మొదలు పెట్టారు. ఫిర్యాదు చేసిన శిక్కు కుటుంబం తమ సాధారణ వేషం, దుస్తులు ధరించటం మామూలే.
అదే విధంగా కౌర్ తమ మతానికి తగ్గట్టు ఒక చిన్న కత్తిని సింగ్ ఒక తలపాగాను కలిగి వుండటంతో వచ్చిన పోలీసులు వారిని మరింత అనుమానంగా చూడటం, వారిపైనే దౌర్జన్యం చేయటం చేశారు. 60 ఏళ్ళ కౌర్ తల్లిని సైతం వీరు అనుమానించి దౌర్జన్యం చేశారు. ఇండియాలో జరిగిన బాంబు పేలుళ్ళ గురించి తెలుసా ? వాటికి మీకు ఏమైనా సంబంధాలున్నాయా ? అంటూ దుర్భాషలాడారు మరో అనుచరుడు తాను కువయిట్ వెళ్ళానని, అక్కడి ముస్లింల గురించి తనకు బాగా తెలుసని అన్నాడు. ఇంతలో ఒక ఢిపార్ట్ మెంట్ సూపర్వైజర్ రావటం వారిని వదిలి వేయాల్సిందిగా ఆదేశాలివ్వటం జరిగింది. షెరీఫ్ మనుషులు కొంచెం అతిగానే ప్రవర్తించారని అతను ఒప్పు కున్నాడు.
జరిగిన ఈ సంఘటనకు నగరంలోని సిక్కు జాతీయుల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిప్యూటీలకు క్రమశిక్షణ ఇప్పించాలనీ, జాతి వివక్షతలపై వారికి ట్రైనింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications