డబ్లిన్‌లో ఉగాది సంబరాలు

సోలో మ్యూజిక్, మైమ్ సంబంధిత పిల్లల కార్యక్రమాలు నిర్వహించారు. పురుషులు సాంఘిక హాస్య నాటికను ప్రదర్సించారు. తొలిసారి గయోపాఖ్యానం అనే పౌరాణిక నాటక ప్రదర్శన కూడా డబ్లిన్‌లో కూడా జరిగింది. స్థానికులే ఈ నాటికలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఐర్లాండ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పిల్లల కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఐర్లాండ్ తెలుగు సంఘాన్ని స్థాపించి ఐదేళ్లవుతోంది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. కుమార్ వర్మ రుద్రరాజు అధ్యక్షుడిగా, శ్రీకాంత్ తాటి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శివరాం రెడ్డి, రామకృష్ణ ఆచంట, హనుమంత రావు మరపల్లి, రమేష్ రాచెర్ల, బుషారా షేక్ ఎన్నికయ్యారు. వారిని ఉగాది సంబరాలకు వచ్చిన తెలుగువారికి పరిచయం చేశారు.
రవాణ, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ లియో వరాద్కర్ ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఐరిష్ మంత్రిమండలిలో భారత సంబంధాలున్న తొలి ఐరిష్ మంత్రి ఆయన. కౌన్సిలర్, రాయబారి రమణ మూర్తి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.