వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలంబస్‌లో కిట్స్(ఎస్) పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
కొలంబస్ పరిసరాల్లో విదేశాంధ్రుల కమల ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్- సింగపూర్, కరీంనగర్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఇటీవల జరిగింది. పదేళ్ళ తరువాత కొత్తగా కలుసుకున్న పాట మిత్రుల బృందం గత స్మృతులు నెమరువేసుకుంటూ ప్రకృతి వొడిలో సేదతీరాయి. ఆగష్టు 19 నుండి 21 తేది వరకు సాగిన ఈ పూర్వ విద్యార్ధుల దశాబ్ది సమ్మేళనం అందరిని ఆనందపరిచాయి. కిట్స్(ఎస్) లో విద్యనభ్యసించిన ఈ తెలుగు విద్యార్దుల బృందం అమెరికా లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడింది. వీరంతా కాలేజీ స్థాపించిన మొట్ట మొదటి బ్యాచ్(1997 - 2001) అవడం కారణంగా కిట్స్(ఎస్)-పయనీర్స్ గా ప్రసిద్ధి పొందారు. ఈ ఏడాది తో తమ బ్యాచ్ పదేళ్ళు పూర్తి చేసుకోవడం తో ఒక్క చోట కలవాలని నిర్ణయించుకున్నారు. విదేశీ ఖండంపై ఒకరినొకరు కలుసుకొని ఆనందాన్ని, ఆనందబాష్పాలని పరస్పరం పంచుకున్నారు.

ఆగష్టు 20న విశ్వనాథరాజు బ్రహ్మండభేరి వాఖ్యాతగా వ్యవహరిస్తూ మిత బృందానికి స్వాగతం పలుకుతూ, కాలేజీ రోజుల నాటి ఫోటోలు, వీడియోలతో ఒక్క సారిగా అందరిని మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకునేల చేసారు. వారి మధ్యలో ఇకలేని మిత్రులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి సహవాసాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పది సంవత్సరాల ప్రస్తానంలో జరిగిన కష్ట సుఖాలని ప్రతి ఒక్కరు వారి మిత్రులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన 'కాలేజీ రోజుల మీద క్విజ్' అందరిని ఉత్సాహంగా పాల్గొనేల చేసి అందరిని ఆకట్టుకుంది. క్రికెట్, వాలీబాల్, బింగో తదితర క్రీడాపోటిల్లో మిత్రులు పోటాపోటీగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని మొదటనుండి చక్కగా అమలు చేస్తూ వచ్చిన ముఖ్య నిర్వాహకులు అయిన విశ్వనాథరాజు బ్రహ్మండభేరి, రాగిణి నీరుమళ్ళ కు, వారికి సహాయం అందించిన వివేక్ మ్యాడం, జీవన్ రేవూరి, రజనీష్ కాటారపు, భగీరధ్ పెసరు, మూర్తి తాడేపల్లి, శ్రీధర్ బింగి, తిరు వెంగంటి, రవి తౌటం, రతన్ ఇరుకుళ్ళ కు మితులు కృతజ్ఞతలు తెలియ చేస్తూ కార్యక్రమం ముగించారు.

English summary
Mother Land, Society's and cultural values are still proved to be at first place for the NRI Engineers even after 10 years reliving college life, sharing wonderful memories, reminiscing cherished moments, committing to a social cause, contribution to home country celebrating friendship was the theme at the "Das Saal Baad" college reunion of NRI engineers currently living in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X